నిహారిక కొత్త వెబ్ సిరీస్‌

ముద్ద ప‌ప్పు ఆవ‌కాయ్‌తో అల‌రించింది నిహారిక‌. న‌టిగా ఆమె ప్ర‌స్థానం వెబ్ సిరీస్‌తోనే మొద‌లైంది. ఇప్ప‌టికీ ఆ అనుబంధం కొన‌సాగుతూనే ఉంది. త్వ‌ర‌లో నిహారిక మ‌రో వెబ్ సిరీస్‌కి శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. ఇందులో నిహారిక న‌టించ‌డ‌మే కాదు… నిర్మిస్తోంది కూడా. వెబ్ సిరీస్ అంటే.. ఓ క‌థ‌ని కొన్ని భాగాలుగా చెప్ప‌డం. అయితే ఈసారి ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ప్ర‌తీ భాగంలోనూ ఓ క‌థ ఉంటుంది. వారం వారం కొత్త క‌థ‌తో వెబ్ సిరీస్ న‌డుస్తుంది. ‘అమృతం’ లా అన్న‌మాట‌.

”గ‌తంలో వ‌చ్చిన అమృతం ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌. ప్ర‌తి ఎపిసోడ్‌కీ క‌థ మారిపోయేది. ఈసారి వెబ్ సిరీస్ లో అలాంటి ప్ర‌యోగం చేయ‌బోతున్నాం. ప్ర‌తీ ఎపిసోడ్‌లోనూ ఓ కొత్త క‌థ చూపిస్తాం. కొత్త పాత్ర‌లు వ‌స్తుంటాయి. వంద ఎపిసోడ్ల వ‌ర‌కూ ఈ సిరీస్‌ని అలానే న‌డిపించాల‌ని వుంది” అంటోంది నిహారిక‌. త‌ను క‌థానాయిక‌గా న‌టించిన ‘సూర్య‌కాంతం’ ఈ శుక్ర‌వారం విడుదల కానుంది. ”నా నుంచి వ‌చ్చిన రెండు సినిమాలూ స‌రిగా ఆడ‌లేదు. వాటికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయి. అయితే క‌థ విష‌యంలో, పాత్ర‌ల ఎంపిక‌ల విష‌యంలోనూ నేనెప్పుడూ త‌ప్పు చేయ‌లేదు. ‘సూర్య‌కాంతం’ కూడా మంచి క‌థే. అయితే ఈసారి నాకు విజ‌యం ద‌క్కుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది” అని చెప్పుకొచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close