ఎక్స్‌క్లూజీవ్‌: న‌క్స‌లైట్‌గా రానా

తొలి సినిమా ‘నీదీ నాదీ ఒకే క‌థ‌’తో ఆక‌ట్టుకున్నాడు వేణు ఉడుగుల‌. ఇప్పుడు రానాతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘విరాఠ ప‌ర్వం’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఎమ‌ర్జెన్సీ కాలం నాటి క‌థ ఇది. ఇందులో రానా న‌క్స‌లైట్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ స‌మాజంపై, ప్ర‌భుత్వ విధానాల‌పై, పెత్తందారీ వ్య‌వ‌స్థ‌పై తిరుగుబాటు చేసి – తానొక్క‌డే ఏం సాధించ‌లేక‌పోవ‌డంతో న‌క్స‌లైట్‌గా మారిపోయే యువ‌కుడిగా ఆయ‌న పాత్ర క‌నిపిచ‌బోతోంద‌ని స‌మాచారం. ఇదో పొలిటిక‌ల్ డ్రామా.. అయితే వాటి మ‌ధ్య ఓ అంద‌మైన ప్రేమ‌కథ‌ని మేళ‌వించిన‌ట్టు తెలుస్తోంది. మాన‌వ హ‌క్కులు, నైతిక విలువ‌లు, ప్ర‌భుత్వ విధానాల‌పై ఓ విమ‌ర్శ‌నాస్త్రం సంధించ‌బోతున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ట‌బు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఆమె.. మాన‌వ హ‌క్కుల నేత‌గా న‌టించ‌బోతోంద‌ని టాక్‌. మొత్తానికి చాలా పెద్ద స్పాన్ ఉన్న క‌థ‌ని వేణు ఉడుగుల ఎంచుకున్నాడనిపిస్తోంది. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం మే, జూన్‌ల‌లో సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close