కర్నూల్లో మోడీ టార్గెట్ బాబు..! బెయిల్‌పై తిరుగుతున్న వారితో ఎవరు అంటకాగుతున్నారు..?

బెయిల్‌పై తిరుగుతున్న వారిని వెంట బెట్టుకుని తనను ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్నూలులో విమర్శలు గుప్పించారు. బెయిల్ అనే మాట ఉత్తరాది రాష్ట్రాల్లో వినిపిస్తే.. ఇంకెవరినైనా గుర్తుకు తెచ్చుకుంటారు కానీ.. ఏపీలో మాత్రం… బెయిల్ అంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తుకు వస్తారు. ఈ విషయం మోడీకి తెలియదేమో కానీ.. ఆ పదం అసువుగా వాడేశారు. కర్నూలులో జరిగిన మీటింగ్‌లో.. ఆయన తన గొప్పలు చెప్పుకోవడం.. చంద్రబాబును విమర్శించడానికే సమయం కేటాయించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఐదేళ్ల కాలంలో… ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నించానని మోదీ చెప్పుకొచ్చారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపామని.. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని .. కర్నూలులో మెగా సోలర్‌ పవర్‌ పార్క్‌, విశాఖలో సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌ కూడా ఇచ్చామని జాబితా చెప్పుకొచ్చారు.

సాగరమాల ప్రాజెక్ట్ కింద రూ.2.50 లక్షల కోట్లు ఇచ్చామని.. మోడీ ప్రకటించారు. ఇంకా ఏపీని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీలో ఉన్న నాయకత్వం సహకరించడం లేదని.. అందుకే.. ఏప్రిల్ పదకొండో తేదీన జరిగే ఓటింగ్‌లో కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. ఏపీకి సన్‌రైజ్ స్టేట్ అని పేరు పెట్టుకున్నారని అయితే.. పుత్రుడి రాజకీయ భవిష్యత్‌ కోసమే ఆ తండ్రి తపిస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు. ఏపీ ప్రజలకు సన్‌రైజ్‌ కావాలా?…పుత్రోదయం కావాలా? అని ప్రశ్నించారు. ఏపీలో కూడా బీజేపీ వస్తే అభివృద్ధి రెండు ఇంజిన్ల వేగంతో పరుగెడుతుందని భరోసా ఇచ్చారు. ఇచ్చిన డబ్బుకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని.. ఎన్నికల్లో పోటీ చేసేవారంతా యూటర్న్‌ బాబు అనుచరులేనని మండి పడ్డారు. అబద్ధాలతోనే చంద్రబాబు జీవిస్తున్నారని .. కేంద్ర పథకాలకు చంద్రబాబు స్టిక్కర్ వేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు అవినీతిమయం అయ్యాయన్నారు. ఎన్టీఆర్ సెంటిమెంట్ లాంటి అంశాలను..మోడీ ఈ సారి ప్రస్తావించలేదు.

గత ఎన్నికలకు ముందు.. కూడా.. మోడీ.. ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అప్పుడు టీడీపీతో పొత్తు ఉంది. ఒకే రోజు.. నాలుగైదు సభల్లో ప్రసంగించారు. ప్రతీ సభలోనూ..ప్రత్యేకహోదా, ఢిల్లీని మించిన అమరావతి సహా.. విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ.. పైకి ఒంటరిగా పోటీ చేస్తోంది. దీంతో ఒక్క సభకే పరిమితం అయ్యారు. ఆ సభలోనూ.. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన విభజన హమీల గురించి ప్రస్తావించలేదు. అరకొరగా నిధులు ఇస్తున్న… విద్యాసంస్థలు, జీవం లేని రైల్వేజోన్ ఇచ్చినట్లు చెప్పుకుని… ఓట్లడిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు…

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ల్యాండ్ క‌బ్జా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జ‌న్యాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసు అధికారుల‌తో క‌లిసి...

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

బీఆర్ఎస్ లో టెన్షన్ .. బినామీ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం..?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close