చైతూకి అఖిల్ పాఠాలు

అఖిల్ కంటే నాగ‌చైత‌న్య సీనియ‌ర్‌. పైగా అన్న‌య్య‌. అయిన‌ప్ప‌టికీ… అఖిల్ చైతూకి కొన్ని టిప్స్ ఇవ్వాల్సివ‌చ్చింది. ఆ టిప్స్‌తోనే మ‌జిలీలోని త‌న పాత్ర‌కి న్యాయం చేశానంటున్నాడు నాగ‌చైత‌న్య‌. అవును.. చైతూ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘మ‌జిలీ’. ఈ సినిమాలోని పాత్ర కోసం అఖిల్ టిప్స్ తీసుకోవాల్సివ‌చ్చింది. ఎందుకంటే.. ఇందులో నాగ‌చైత‌న్య ఓ క్రికెట‌ర్‌గా న‌టించాడు. అయితే ఇది వ‌ర‌కు.. చైతూకి క్రికెట్‌తో అస్స‌లు ట‌చ్ లేదు. ఈ సినిమా కోస‌మే క్రికెట్ నేర్చుకోవాల్సివ‌చ్చింది. అందుకోసం కొంత‌మంది రంజీ ప్లేయ‌ర్స్ ద‌గ్గ‌ర కోచింగ్ తీసుకున్నాడు చైతూ. దాంతో పాటు అఖిల్ స‌ల‌హాలూ సూచ‌న‌లు పాటించాడ‌ట‌. ”నాకు క్రికెట్ బొత్తిగా రాదు. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను. ఆ త‌ర‌వాత బ్యాట్ ముట్టుకోలేదు. అఖిల్ మాత్రం ఎప్పుడూ క్రికెట్ ధ్యాస‌లోనే ఉంటాడు. అందుకే అఖిల్ ద‌గ్గ‌ర టిప్స్ తీసుకున్నాను. ఓ ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్ లైఫ్ స్టైల్ ఏమిటో, గ్రౌండ్‌లో ఎలా ఉంటాడో అఖిల్ చెప్పాడు. అవ‌న్నీ పాటించాను..” అంటున్నాడు చైతూ. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close