బేరాలు, బెదిరింపులు..! ద్వితీయ శ్రేణి నేతలపై వైసీపీ వల..!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తేది దగ్గరకు రావడంతో… వైసీపీ.. ద్వితీయ శ్రేణి నేతలపై కన్నేసింది. తెలుగుదేశం పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తలు కొండంత బలంగా ఉంటారు . క్రియాశీలక కార్యకర్తలు ఎప్పుడూ తెలుగుదేశానికి వెన్నుదన్నుగా ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కోస్తాలోని కీలక నియోజకవర్గాలలో వైసీపీకి చెందిన కొన్ని ప్రత్యేక బృందాలు.. మకాం వేశాయి. వీరి పని అంతా ఆయా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న నేతల బలహీనతలేమిటో తెలుసుకోవడం, వారికున్న అనుచరగణాన్ని కొనేయడం. నియోజకవర్గంలో వైసీపీకి ఎక్కడ బలహీనంగా ఉందో తెలుసుకుని , ఆ ప్రాంతాలలో ప్రత్యర్ధి వర్గంలో ఉన్న బలమైన నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతమందిని పార్టీ మారుస్తూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేస్తుండగా, మరికొందరికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ సైలెంట్ అయిపోవాల్సిందిగా లోపాయికారిగా డబ్బులు ముట్ట చెబుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వైసీపీ టీం.. ఒక్కో నియోజకవర్గానికి 50 నుంచి 75 మంది వరకు పర్యటిస్తున్నారు. వీరు మండలాలలో, గ్రామాలలో కులాల వారీగా ఓటర్లను, అక్కడ ఉన్న వివిధ పక్షాల బలాబలాలను నేతల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తమ టీం హెడ్ కు చెబుతున్నారు. వారు అక్కడ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్దులకు మార్గదర్శనం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలలో ఓ నియోజకవర్గంలో మండల స్థాయి నేత ఒకరికి సుమారు కోటిన్నర రూపాయల వరకు ముట్టజెప్పి తెలుగుదేశానికి రాజీనామా చేయించారు. ఇదే నియోజకవర్గంలో మరికొందరు నేతలపై కూడా వల విసిరారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలలో వైసిపి తరుపున పోటీ చేసే ధనవంతులైన అభ్యర్దులున్న నియోజకవర్గాలలో వైసీపీ టీడీపీ నేతల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో తమకు పదవులు రాక, ఎటువంటి గుర్తింపుకు నోచుకోని ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ప్రత్యర్ధులు విసురుతున్న వలలో చిక్కుకుంటున్నారు. అప్పులు ఉన్న కొంతమంది నేతల కుటుంబ అవసరాల కోసం డబ్బు కూడా ఇచ్చి వారిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు. వైసిపి వ్యూహాన్ని తెలుసుకున్న తెలుగుదేశం నేతలు విరుగుడు వ్యూహంతో ముందుకు వెలుతున్నారు. రివర్స్‌లో వైసీపీ నేతల్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close