నిహారిక హ్యాట్రిక్ ప‌రిపూర్ణం

పాపం నిహారిక‌… ఏదీ క‌ల‌సి రావ‌డం లేదు. మెగా డాట‌ర్ అనే ట్యాగ్ లైన్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్ డిజాస్ట‌ర్లుగా మిగిలిపోయాయి. హిట్టు కోసం ప‌రిత‌పిస్తూ.. త‌పిస్తూ.. ‘సూర్య‌కాంతం’ అనే సినిమా తీసింది. శుక్ర‌వారం విడుద‌లైన ఈసినిమాతో నిహారిక ప‌రాజ‌యాల హ్యాట్రిక్ ప‌రిపూర్ణ‌మైన‌ట్టే. వెబ్ సిరీస్‌కి స‌రిప‌డ క‌థ‌ని, సినిమాగా వండేస్తే ఎలా ఉంటుందో చెప్ప‌డానికి ‘సూర్య‌కాంతం’ అత్యుత్త‌మ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ఈ కథ‌, క‌థ‌నాలు సినిమాకి స‌రితూగ‌లేక‌.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. నిజానికి ఈ క‌థ‌ని వెబ్ సిరీస్‌గా తీసుకున్నా బాగుండేదేమో.

సినిమాకి ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డం అటుంచితే.. న‌టిగా నిహారిక కూడా ఈ సినిమాతో చేసిందేం లేదు. అప్పుడ‌ప్పుడూ ఓవ‌ర్ యాక్టింగ్‌తో బాగా ఇబ్బంది ప‌డింది. త‌ను కూడా… వెబ్ సిరీస్ మూడ్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదేమో అనిపిస్తోంది. ‘నేను హీరోయిన్ మెటీరియ‌ల్ కాదు’ అనేది నిహారిక త‌ర‌చూ చెప్పే మాట‌. అది నిజ‌మే. కాక‌పోతే…. త‌న శైలికి త‌గిన‌ట్టుగా క‌థ‌ల్ని ఎంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. హుషారైన న‌ట‌న అంటే ఓవ‌ర్ యాక్టింగ్ చేయ‌డం కాద‌ని నిహారిక గ్ర‌హించాలి. తొలి రెండు సినిమాలూ ఫ్లాప్ అయినా.. నిహారిక‌కు మైన‌స్ మార్కులేం ప‌డ‌లేదు. ఆ లోటు.. సూర్య‌కాంతం తీర్చేట్టు ఉంది. ఇక‌నైనా యాక్టింగ్ మీట‌ర్‌ని నిహారిక దృష్టిలో పెట్టుకుంటే మంచిదేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close