జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న మోహన్ బాబు ..!

అధికారికంగా వైసీపీలో చేరిన మోహన్ బాబు.. జగన్మోహన్ రెడ్డి కోసం.. బ్యాటింగ్ ప్రారంభించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి..నిరూపించుకుంటాడని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన మోహన్ చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కంటే ముందే నేను టీడీపీలో ఉన్నానని గుర్తు చేశారు. చంద్రబాబు పునాది కాంగ్రెస్‌ అన్నారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు పోటీ చేస్తానన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు టీడీపీని లాక్కున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుది కుటుంబ పాలన చేస్తున్నారని.. దోచుకోవడానికి ఇసుకను కూడా వదల్లేదన్నారు.

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు అమాయకులు.. వారిని చంద్రబాబు మోసం చేశారని… ఆయన మాటలు నమ్మినవాడు ఎవడైనా మునగాల్సిందేనని శాపనార్ధాలు పెట్టారు. చంద్రబాబు కోసం టీడీపీలో ఎవరూ పనిచేయడం లేదన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే టీడీపీలో కొనసాగుతున్నారని మోహన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు… విషయంలో.. ఇప్పటికీ ఉన్నవీ.. లేనివీ చెప్పడానికి గత ఆరు నెలలుగా.. వైసీపీ… అన్ని రకాల అస్త్రాలను వాడేసింది. చివరికి సినిమాలు కూడా తీయించింది. ఇక చివరిగా మోహన్ బాబు మిగిలారు. ఆయన కూడా వచ్చి చంద్రబాబును విమర్శించేశారు. అయితే.. ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు ఎందుకు తెరపైకి తెస్తున్నారో… ప్రజలు అర్థం కాకుండా ఉంటుందా..? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లే సమయంలో.. మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న లక్ష్మిపార్వతి.. అనేక ఇంటర్యూల్లో.. చంద్రబాబు కన్నా.. మోహన్ బాబునే ఎక్కువగా తిట్టింది. అప్పట్లో ఓ సందర్బంలో.. ఎన్టీఆర్ ఇంటి దగ్గరకు మోహన్ బాబు వెళ్తే… చెప్పులదో ఎన్టీఆర్ అభిమానులు దాడి చేశారని.. పత్రికల్లో వచ్చింది. ఆ సమయంలో.. పరిటాల రవి.. జాగ్రత్తగా.. బయటకు పంపారని కూడా చెప్పుకున్నారు. కానీ.. మోహన్ బాబు.. అవన్నీ తనకు తెలియదన్నట్లుగా.. చెప్పుకొచ్చి… అమాయకత్వం నటిస్తున్నారు. వైసీపీలో చేరితే అంతే కదా..!.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close