జీవీఎల్ అలియాస్ నాగసముద్రం బుజ్జి..! బాబు టార్గెట్‌గా పెట్టిన లైనప్ ఇదే..!

మీకు నాగసముద్రం బుజ్జి తెలుసా..?
అతడు సినిమాలో మహేష్‌బాబును ఏసేయడానికి.. అడుగడుగునా.. మనుషుల్ని పెడతాడు. ఎక్కడ మిస్సయినా.. వేసేయడానికి.. తర్వాత స్టెప్‌లో మనుషుల్ని పెంచుకుంటూ పోతాడు. చివరి స్పాట్ దగ్గర… ఒక్క కార్లో పాతిక మందిని తీసుకొస్తాడు.. ! ఆ నాగసముద్రం బుజ్జి ఇప్పుడు.. ఏపీ రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఆయనెవరో కూడా… యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయిన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. ఈ నాగసముద్రం బుజ్జి.. ఏం చేశాడో.. ఆయనకు తెలుసో లేదో కానీ.. అచ్చంగా ఇప్పుడు ఆయన ఏపీలో అదే చేయబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి.. ఒక్క చోట అయినా డిపాజిట్ వస్తుందని.. ఎవరూ చెప్పడం లేదు. కానీ బీజేపీ నేతల హడావుడి మాత్రం మామూలుగా లేదు. అభ్యర్థులు ప్రజల్లో పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఏపీ బాధ్యతల్ని తీసుకున్న జీవీఎల్ నరసింహారావు మాత్రం… ఓ లైనప్ రెడీ చేశారు. అందులో ప్రధానమంత్రి దగ్గర్నుంచి పీయూష్ గోయల్ వరకు ఉన్నారు. ఇప్పటికే.. శుక్రవారం రోజున… ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. అయితే.. అది ఓపెనింగ్ మాత్రమే.. ముందు ముందు లైనప్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది.

ఏప్రిల్ ఒకటో తేదీన రాజమండ్రిలో ప్రధాని మోదీ వస్తారు..! చంద్రబాబుపై ఎటాక్ చేస్తారు..! ఆ తర్వాత నాలుగో తేదీన అమిత్ షా వస్తారు.. నర్సరావుపేట, విశాఖలో చంద్రబాబును టార్గెట్ చేసుకుంటారు..! అదే నాలుగు, ఐదు తేదీల్లో.. చంద్రబాబుపై డబుల్ ఎటాక్ కోసం.. రాజ్‌నాథ్ సింగ్‌ను.. నర్సాపురం, విజయనగరంలలో దింపుతారట..! వారి డ్యూటీ అయిపోయి ఆలా వెళ్లిపోగానే… 5,6 తేదీల్లో యోగి ఆదిత్యనాథ్‌ రంగంలోకి వస్తారు..! ఈ మధ్యలో గ్యాప్ ఉన్నా.. లేకపోయినా… నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌ కూడా వస్తారు. ఫినిషింగ్ టచ్ ఇస్తారో తెలియదు కానీ.. అది కూడా ఘనంగా ఉంటుంది. ఈ సారి నాగసముద్రం బుజ్జి టైప్‌లోఅందర్నీ తీసుకొచ్చి ఓ భారీ సభ పెట్టినా పెట్టొచ్చు ఇంకా… క్లారిటీ లేదు.

ఇంత చేసినా… వారి లక్ష్యం.. బీజేపీని గెలిపించమని కోరడం కాదు. కేవలం టీడీపీని ఓడించమనడమే. వచ్చే వాళ్లంతా.. టీడీపీని విమర్శించి.. విమర్శించి పోతారు. అంటే.. వాళ్ల ఉద్దేశం.. వైసీపీకి ఓటేయమని. ఆ విషయం మాత్రం నేరుగా చెప్పారు. అలా చెబితే .. వైసీపీకి వచ్చే ఓట్లు కూడా రావని వాళ్లకు కూడా తెలుసు. మొత్తానికి ఏపీ గురించి బాద్యత తీసుకున్న జీవీఎల్.. ప్రధానిని సహా .. నేతలందర్నీ తిప్పి.. ఒక్క చోట అయినా డిపాజిట్ సంపాదించి పెడతారా అన్నది అసలు పాయింట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close