మోడీనే చెప్పుకోలేదు.. కానీ జగన్ చెబుతున్నారు..! కియాను మోడీ తెచ్చారట..!

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించారు. రాయలసీమ అభివృద్ధి గురించి చాలా చెప్పారు. సోలార్ పార్క్ లన్నారు.. విద్యా సంస్థల గురించి చెప్పారు.. కానీ… కియా పరిశ్రమ గురించి మాట్లాడలేదు. దాన్ని తాను తీసుకొచ్చానని.. చెప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వ శ్రమ ఒక్క చెమటి చుక్క ఉన్నా.. ఒక్క రూపాయి నిధులు ఇచ్చినా.. మోడీ దాన్ని… ఫ్లెక్సీలు వేసుకుని… రాష్ట్రం మొత్తం చెప్పుకునేవారు. కానీ కియా గురించి చెప్పలేదంటే.. అందులో ఆయన పాత్ర లేనట్లేగా..!. పైగా.. కియా పరిశ్రమ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఒక్క సారి కూడా కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్ మెంట్ కనిపించలేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వ్యవహారాలు నడిచాయి.

అయితే.. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం.. భారతీయ జనతా పార్టీ వల్లే కియా వచ్చిందని ప్రచారం చేసుకునేవాళ్లు. నిజంగా కియాను బీజేపీ నేతలే తెచ్చి ఉంటే… ఎంత హడావుడి జరిగి ఉండేదో.. చాలా మందికి తెలుసు. అందుకే.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీ నేతలు కాబట్టి చెప్పుకుంటున్నారని అనుకుందాం.. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా.. కియా పరిశ్రమ క్రెడిట్ ను.. నరేంద్రమోడీకి కట్ట బెట్టడానికే ప్రయత్నించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జగన్‌ ఎన్నికల ప్రచారం చేిసన జగన్… మోడీ వల్లే అనంత జిల్లాకు కియా మోటర్స్‌ వచ్చిందని నిర్మోహకమాటంగా ప్రకటించేశారు. నిజానికి కియా పరిశ్రమ గురించి జగన్ ఎప్పుడూ పాజిటివ్ గా స్పందించలేదు.

ఆయన మీడియాలోనూ వ్యతిరేక వార్తలే వచ్చాయి. చైనాలో కియా ప్లాంట్ మూసేసశారని.. ఏపీలో మూత పడుతుందని.. విజసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు.. కియా మోటార్స్‌కు ఇస్తున్నారని.. జగన్ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత స్థానికులకు ఉద్యోగాలివ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఇలా.. అన్నీ చేసి.. ఇప్పుడు.. కియా మోటార్స్ ను.. మోడీనే తీసుకొచ్చారని… క్రెడిట్ ఆయనకు కట్టబెట్టేశారు. తనకు రాకపోయినా.. ఆ క్రెడిట్.. తన రహస్య మిత్రుడికి రావాలని జగన్ కోరుకుంటున్నట్లుగా ఉన్నారన్న అభిప్రాయం జగన్ ప్రకటన తర్వాత ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close