టీడీపీ గెలుపుపై సబ్బం హరి ఆసక్తికర వ్యాఖ్యలు

‘గతంలో చంద్రబాబు నాయుడు గెలిచిన సీట్లలో ఓ 15 నుంచి 20 కోల్పోవచ్చు, గతంలో జగన్ గెలిచిన సీట్లలో ఆయనా 20 దాకా కోల్పోవచ్చు, ఇటు సీట్లు కొన్ని అటు.. అటువి కొన్ని ఇటు వస్తాయ’ని చెప్తున్నారు టీడీపీ నేత సబ్బం హరి. మొత్తంగా, తెలుగుదేశం పార్టీకి 90 నుంచి 100 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లు 130 దాకా వస్తాయని అంటున్నాగానీ, తనకు ఉన్న సమాచారమైతే 100కి తగ్గవు అన్నారు. గత ఎన్నికల సమయంలో… కౌంటింగ్ కి ఒక రోజు ముందే తాను చెప్పాననీ, అప్పుడు తాను పార్టీలో లేననీ, నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారని అన్నానని గుర్తుచేశారు. పార్టీ లేనప్పుడు వ్యక్తం చేసిన భావాలను ఎలా అయితే ఇష్టపడేవారో, ఇప్పుడు కూడా తన వ్యాఖ్యల్ని అలాగే చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగానే, ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు చెప్తున్నా అన్నారు హరి.

నాలుగు నెలల కిందట, కేవలం పట్టణ ప్రాంతంలోనే టీడీపీకి అనుకూలంగా ఉందనీ, గ్రామీణంలో వైకాపాకి బాగుందని చెప్పానని హరి అన్నారు. రాబోయే ఎన్నికలు టీడీపీకి అంతగా అనుకూలంగా ఉండదని తాను చెప్పానన్నారు. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నెమ్మదిగా ఆ పరిస్థితిని మార్చాయన్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆలోచనా విధానమే అన్నారు. పోలవరంగానీ, రాజధాని నిర్మాణంగానీ, పరిశ్రమల ఏర్పాటులోగానీ రాష్ట్రం కిందికి పడలేదనీ, కేంద్రం సహకరించకపోయినా ముందుకే వెళ్తోందన్నారు. ఓ పక్క ఇలా అభివృద్ధి చేస్తూనే.. మరోపక్క ప్రతీ కుటుంబానికీ ఏదో ఒక రూపంలో వికలాంగులకు, మహిళలకు, వ్రుద్ధులకు సంక్షేమ పథకాలను చంద్రబాబు అందించారన్నారు. టెక్నాలజీ సాయంతో నేరుగా ప్రజలకు సాయం అందాలని ప్రయత్నించారన్నారు.

రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా చంద్రబాబు తీసుకెళ్తున్నారనేది, ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంలో పార్టీలో కిందిస్థాయి వర్గాల్లో కొంత విఫలత కనిపిస్తోందన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అనీ, తను గెలవడానికి కూడా ఆయనే కారణమన్నారు సబ్బం హరి. ఇది చంద్రబాబు వ్యక్తిగత విజయంగానే తాను చూస్తున్నా అన్నారు. ఎన్నికలు జరిగిన తీరుపై నిష్పాక్షికంగానే సబ్బం హరి మాట్లాడారని చెప్పాలి. టీడీపీ కేడర్ కొంత అలసత్వం ప్రదర్శించిందని కూడా ఆయన చెప్పారు. పోలింగ్ నిర్వహణలో ఎన్నికల సంఘం వైఫల్యాన్ని వైకాపా తప్పుబట్టడం లేదనీ, దీంతో కష్టపడి ఓటేసినవారంతా ఇప్పుడు ఆ పార్టీ తీరు చూసి నవ్వుకుంటున్నారన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close