స‌మంత నోరు జారిందా?

స‌మంత కి కాస్త ఆవేశం ఎక్కువే. ఏదీ మ‌న‌సులో దాచుకోదు. ఇది వ‌ర‌కు కూడా చాలా సంద‌ర్భాల్లో నోరు జారి… టాప్ సీక్రెట్‌ల‌ను బ‌య‌ట‌పెట్టేసింది. ఈసారీ అదే జ‌రిగింది. ‘మ‌న్మ‌థుడు 2’లో స‌మంత ఓ పాత్ర చేస్తోంది. ఈ విష‌యాన్ని స‌మంతే మీడియాకి చెప్పింది. నిజానికి ఈ విష‌యాన్ని అతి జాగ్ర‌త్త‌గా దాచి, సినిమా విడుద‌ల స‌మ‌యంలో బ‌య‌ట‌పెట్టి షాక్ ఇవ్వాల‌ని చూసింది చిత్ర‌బృందం. ఈ విష‌యాన్ని స‌మంత‌కు ముందే చెప్పారు కూడా. కానీ స‌మంత మాత్రం త‌న ఆనందాన్ని ఆపుకోలేక‌… మీడియాకి చెప్పేసింది.

శ‌నివారం చై- స‌మంత ఇద్ద‌రూ క‌ల‌సి ప్రింట్ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఈ స‌మ‌యంలో ‘మ‌న్మ‌థుడు 2’ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అందులో న‌టిస్తున్నారా? అంటూ పాత్రికేయులు క్లారిటీ కోసం అడిగారు. దాంతో చైత‌న్య అందుకుని… ”నువ్వేగా మీడియాకు లీక్ చేసేశావ్‌. దానికి నువ్వే స‌మాధానం చెప్పు.” అంటూ స‌మంత‌ని స‌ర‌దాగా ఆట ప‌ట్టించాడు. దాంతో.. స‌మంత కూడా ”అవును న‌టిస్తున్నాను..” అనేసింది. అయితే మ‌న్మ‌థుడు 2లో స‌మంత క‌థానాయిక కాదు. క‌థ‌ని న‌డిపించే ఓ కీల‌క‌మైన పాత్ర‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close