ఐటీ గ్రిడ్‌పై ఆధార్ కేసు…! కేసు నిలబెట్టడానికి ఇదైనా సరిపోతుందా..?

ఐటీ గ్రిడ్ కేసులో.. ఆధార్ రీజనల్ అధికారులు ఫిర్యాదులు చేశారంటూ.. హైదరాబాద్ పోలీసులు హడావుడిగా ఓ కేసు నమోదు చేసి.. దాన్ని స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్‌కు బదిలీ చేసేశారు. దాంతో.. మళ్లీ మీడియా చానళ్లకు… పోలీసు వర్గాలు లీకులు ప్రారంభించాయి. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం ప్రత్యేకబృందాలు గాలిస్తున్నాయంటూ ఆ లీకుల సారాంశం. నిజానికి.. కేసు నమోదయినప్పటి నుంచి పోలీసులు అశోక్ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడున్నాడో కనిపెట్టేశామని.. వెళ్లి పట్టుకొచ్చేయడమేనని… మీడియాకు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ తీసుకు రాలేదు. కానీ.. అశోక్ రాజకీయ కుట్ర అంటూ.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో… పరిస్థితి సంక్లిష్టంగా మారింది.

అసలు..ఈ కేసు మొదటగా.. ఏపీ ప్రభుత్వ డేటా చోరీ అంటూ ప్రారంభించారు. ఓటర్ల జాబితా… ఐటీ గ్రిడ్ నిర్వహిస్తున్న టీడీపీ యాప్ సేవామిత్రలో ఉందని.. లబ్దిదారుల జాబితా ఉందని.. అదంతా ఏపీ ప్రభుత్వ అధికారిక సమాచారం అన్ని దాన్ని చోరీ చేశారని.. చెప్పుకొచ్చారు. జగన్ బంధువు .. ఫిర్యాదు చేయడంతో.. ఆయనకు విజిల్ బ్లోయర్ అనేహోదా ఇచ్చి… కేసు నమోదు చేసి.. ఐటీ గ్రిడ్ ఆఫీసు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కార్యకలాపాల్ని నిలిపివేశారు. కంప్యూటరన్నీ పట్టుకుపోయారు. భవనాన్ని కూడా సీజ్ చేశారు. కానీ.. ఓటర్ల జాబితా పబ్లిక్ డొమైన్‌లో ఉన్నదేనని.. ఈసీ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి అదే సమాధానం వచ్చింది. దాంతో.. ఈ కేసులో పస లేదని.. ఈ సారి ఆధార్ వైపు నుంచి తీసుకొచ్చారు. ఆధార్ అధికారులు ఫిర్యాదులు చేశారని… కొత్త కేసు నమోదు చేశారు.

ఆధార్ సమాచారం… దొంగిలించలేరు అనేది.. ఆ సంస్థ ఇచ్చిన అధికారిక పత్రం. కానీ… వారిచ్చిన ఫిర్యాదులో ఏముందంటే… తమ దగ్గర ఉండాల్సిన సమాచారం… ఐటీ గ్రిడ్ వద్ద ఉందన్నది.. వారి ఫిర్యాదు. ఏదో విధంగా ఐటీ గ్రిడ్‌ను.. కేసులో ఉంచకపోతే… తాము ఇరుక్కుపోతామని… పడుతున్న కంగారులో భాగంగానే ఈ ఫిర్యాదు వచ్చిందని ఎవరికైనా తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. స్వచ్చందంగా ఇచ్చిన ఆధార్ వివరాలను… చూపి.. తమ దగ్గర ఉండాల్సిన సమాచారం.. వారి దగ్గర ఉందంటూ… ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ వేసిన క్వాష్ పిటిషన్ పై.. విచారణ ఈ నెల ఇరవైన మరోసారి విచారణకు రానుంది. ఈ లోపే… కొత్తగా ఆధార్ కేసు నమోదు చేయడం… అశోక్ కోసం వెదుకులాట అంటూ మళ్లీ హడావుడి ప్రారంభించడంతో.. పోలీసుల తీరుపై.. అనేక అనుమానాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్ Vs ఓటీటీ… తీర్పు మారుతోందా?

సినిమా వెండితెరపై ఆస్వాదించే వినోదం. ఒక సమూహంతో కలసి థియేటర్ లో సినిమా చూడటంలో కిక్కే వేరు. అయితే ఇప్పుడు థియేటర్ కి సమాంతరంగా ఓటీటీ కూడా ఎదుగుతోంది. సినిమా వ్యాపారంలో కీలక...

ఇదేందయా ఇది- కిషన్ రెడ్డిపై కంప్లైంట్..!

కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామళికి విరుద్దంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్...

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close