వెంకీతో మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నివుంది: నాని

మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు చిరునామా.. వెంక‌టేష్‌. యువ‌త‌రం హీరోల్లో అలాంటి అభిరుచి ఉన్న క‌థానాయ‌కుడు నాని. వీరిద్ద‌రూ క‌లిస్తే ఎలా ఉంటుంది? రెండు త‌రాల‌కు స‌రిప‌డినంత వినోదం ఒక్క‌సారిగా చూసిన‌ట్టు అనిపిస్తుంది క‌దూ. వీరిద్ద‌రినీ క‌లిపి చూడాల‌న్న ఆలోచ‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిందో రాదో తెలీదు గానీ, ఇక మీద‌ట మాత్రం క‌చ్చితంగా వ‌స్తుంది. ఎందుకంటే… ఓ హీరో నుంచి ఈ మ‌ల్టీస్టార‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. `వెంక‌టేష్ గారితో క‌ల‌సి ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నివుంది` అంటూ త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టేశాడు నాని.

నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన జెర్సీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కొద్ది సేప‌టి క్రితం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి వెంక‌టేష్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంలోనే నాని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. వెంక‌టేష్ ఆవ‌కాయ లాంటివార‌ని, ఆయ‌న్ని ఇష్ట‌ప‌డ‌ని తెలుగువారు ఉండ‌ర‌ని వ్యాఖ్యానించాడు నాని. వెంక‌టేష్‌తో క‌ల‌సి న‌టించాల‌ని త‌న‌కు బ‌లంగా ఉంద‌ని, అలాంటి సినిమా కోసం తాను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని అన్నాడు. వెంకీ కూడా నానిని పొగ‌డ్త‌ల‌తో ముంచేశాడు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఉన్న అతి కొద్దిమంది స‌హ‌జ‌న‌టుల్లో నాని ఒక‌డ‌ని, సినిమా సినిమానీ తాను ఎదుగుతున్నాడ‌ని కితాబిచ్చాడు. సో.. వీరిద్ద‌రి మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌పై చూడ్డానికి ఇంకెంతో కాలం ఆగ‌క్క‌ర్లేద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close