ఎన్నిక‌ల సంఘం తీరును ఇంకా వెన‌కేసుకొస్తారా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల్ని ఈసీ ఎలా నిర్వ‌హించిందో, ఎన్ని విమ‌ర్శ‌లు పాలౌతోందో చూస్తున్నాం. అయితే, ఇదేదో ఏపీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన అంశంగా, ఓట‌మి భ‌యానికి చంద్ర‌బాబు నాయుడు వెతుకుతున్న సాకుగా మాత్ర‌మే వైకాపా చూస్తోంది. కానీ, ఎన్నిక‌ల సంఘం ప‌నితీరును సాక్షాత్తూ సుప్రీం కోర్టు త‌ప్ప‌బ‌ట్టి, అక్షింత‌లు వేసింది. మీ అధికారాలేంటో మీకు తెలుసా అని సూటిగా ప్ర‌శ్నించింది. స‌రే, ఇది ఏపీకి సంబంధించిన ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరుపై సుప్రీం వ్య‌క్తం చేసిన ఆగ్ర‌హం కాక‌పోవ‌చ్చు. కానీ, ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ఎన్నిక‌ల సంఘం ఎంత అధ్వాన్నంగా ప‌నితీరు ఉంద‌నేది చెప్ప‌డానికి ఇది చాలు. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌లు ఒక్క‌టే కాదు… ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకుంటే ఈసీ ప‌నితీరు ఏంటో ఎవ‌రికైనా అర్థ‌మౌతుంది.

ఫామ్‌-17 పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపున‌కు ద‌ర‌ఖాస్తు దాఖ‌లైన విష‌యం బ‌య‌ట‌ప‌డితే ఈసీ ఏం చెప్పింది… మేం వాటిని నిర్ధారించుకున్నాం, వాటిలో బోగ‌స్ అప్లికేష‌న్లే ఎక్కువ‌నీ, అయినాస‌రే వెంట‌నే క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసేసుకుంటామ‌ని అప్పుడు ప్ర‌క‌టించింది. కానీ, ఆ క‌ఠిన చ‌ర్య‌లు ఎప్పుడు ఉంటాయో వారికే తెలియ‌ని ప‌రిస్థితి..? ఈలోగా ఎన్నిక‌లు కూడా జ‌రిగిపోయాయి. ఇంకే చ‌ర్య‌లు తీసుకుంటారు..? ఇక‌, తెలంగాణ విష‌యానికొస్తే… దాదాపు పాతిక ల‌క్ష‌ల ఓట్ల‌ను జాబితాలోంచి తీసేసిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ స‌మ‌యంలో కోర్టుల‌కు వెళ్లి ఈసీ వినిపించిన వాద‌న ఏంటంటే… ఓట‌ర్ల జాబితాల‌న్నీ స‌క్ర‌మంగానే ఉన్నాయ‌న్నారు. కానీ, ఎన్నిక‌ల్లో ఏమైంది… జాబితాలో పేరులేనివారు ల‌క్ష‌ల్లో ఉన్నారు. కోర్టు ముందు అంతా బాగుంద‌ని చెప్పిన ఈసీ… ఆ త‌రువాత‌, త‌ప్పు జ‌రిగింది క్ష‌మించండి అని చేతులు దులిపేసుకుంది. దీన్నెలా చూడాలి..?

ఇంకా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే… ఎన్నిక‌ల తేదీల నిర్వ‌హ‌ణ‌లో కూడా రాజ‌కీయ ప్రేరేపిత చ‌ర్య‌లు ఉన్న‌ట్టే అనుమానించాల్సి ఉంది. ఆంధ్రా అసెంబ్లీకి ఇంకా గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ కూడా… ఎన్నిక‌ల షెడ్యూల్ లో తొలివిడ‌త‌లోనే ఎన్నిక‌లు పూర్త‌య్యేలా తేదీల్ని పెట్టారు. ఆద‌ర‌బాద‌రాగా ఏపీకి డేట్లు ఇచ్చేయాల్సినంత ప‌నేముంది? ప‌శ్చిమ బెంగాల్ ని తీసుకుంటే… మొత్తం 7 విడ‌త‌ల ఎన్నిక‌లూ ఆ రాష్ట్రంలో జ‌రుగుతున్నాయి. అంటే, ఈనెల 11 నుంచి వ‌చ్చే నెల 19 వ‌ర‌కూ ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లే. ప‌శ్చిమ బెంగాల్ మొత్తానికి ఒకేసారి లోక్ స‌భ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేరా…? ఒక ద‌శ‌లో 2, మ‌రో ద‌శ‌లో 4, ఇంకో ద‌శ‌లో 5… ఇలా విడ‌దీసి విడ‌దీసి ఎందుకు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు…? ఇలా సూక్ష్మ‌దృష్టితో చూస్తుంటే ఏకంగా ఎన్నిక‌ల సంఘం ప‌నితీరుపై చాలా అనుమానాల‌కు ఆస్కారం ఏర్ప‌డుతోంది. దేశ‌వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంటే… ఈసీ ప‌నితీరు శభాష్ అని మెచ్చుకుని లేఖ‌లు రాసే నేత‌లు ఏపీలో మాత్ర‌మే ఉండ‌టాన్ని ఏమ‌నుకోవాలి?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close