చైతన్య : ఆరోరా లాంటి వాళ్లు ఉంటేనే శేషన్ గొప్పతనం తెలుస్తుంది..!

టీఎన్ శేషన్. ఇప్పటి తరానికి తెలియదు కానీ… 1990లలో రాజకీయాలపై ఆసక్తి పెరగడానికి ఆయన ప్రధాన కారణం. నిబంధనలు అంటే నిబంధనలు. పాటించని వారు ఎంతటి వారైనా డోంట్ కేర్. ఆయనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారంటే.. ఆయన పనితీరే కారణం. ఇప్పుడే పదే పదే శేషన్ గురించి చెప్పుకుంటున్నామంటూ.. ఆయన తర్వాత వచ్చిన వారి పనితీరు.. అంత దారుణంగా ఉండటమే కారణం. రాను రాను.. ఈసీ అధికార పార్టీకి జేబు సంస్థగా మారిపోయిన వ్యవహారం.. ఇప్పుడు.. దేశంలో మళ్లీ శేషన్‌ను గుర్తుకు తెచ్చుకునేలా చేస్తోంది.

శేషన్ నిజమైన ప్రజాస్వామ్య పరికక్షకుడు..!

1990ల్లో ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు. అందులోనూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ కు… కేంద్ర ప్రభుత్వాన్ని సైతం లెక్క చేయని అధికారాలు ఉంటాయని తెలియదు. కానీ నిఖార్సయిన అధికారిగా టీఎన్‌ శేషన్‌ ఇలాంటి విస్తృత అధికారాలను గుర్తించారు. ఉపయోగించారు. అక్రమార్కులకు సింహస్వప్నంగా మారారు. ఎంతగా ఉంటే.. అక్రమాల పోలింగ్‌కు కొద్ది గంటల ముందు పంజాబ్‌ ఎన్నికల మొత్తంపై నిషేధం విధించారు. 1993లో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న గుల్షర్‌ అహ్మద్‌ .. మధ్యప్రదేశ్‌లో తన కుమారుడి కోసం ప్రచారం చేయడంతో.. ఆ ఎన్నికను సస్పెండ్‌ చేశారు. నిజానికి ఆనాడు ప్రస్తుతం ఉన్నంత కట్టుదిట్టంగా కూడా కోడ్‌ లేదు. అయినా శేషన్‌ ఆర్టికల్‌ 324తో ఈసీకి వచ్చే అధికారాలను సమర్థంగా ఉపయోగించుకుని ఎన్నికల అక్రమాలను నిరోధించగలిగారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ నేరుగా మోడీకి ప్రచారం చేస్తారు. కానీ.. చర్య తీసుకోరు. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ కాంగ్రెస్‌ పథకాలను విమర్శిస్తారు.. కానీ ఈసీ ఏ చర్యా తీసుకోదు. బీజేపీ ముఖ్యమంత్రులు గీత దాటినా అంతంత మాత్రం మందలింపులే. అందుకే… ఇప్పుడు శేషన్‌ను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.

ఈసీ అధికారాలన్నీ విపక్ష పార్టీలను టార్గెట్ చేయడానికేనా..?

ప్రధాని మొదలుకొని ప్రతి ఒక్కరూ యథేచ్ఛగా, నిర్భయంగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడానికి కారణం ఈసీ నిర్లిప్తతే. రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిపే అధికారం ఈసీదే! ఇది ఓ రకంగా ఈసీకి బ్రహ్మాస్త్రం. ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణ, మార్గనిర్దేశకత్వం.. అన్నీ ఈసీవే. అయితే.. ఈసీ ఈ అధికారాలను.. కేంద్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలపైనే ప్రయోగిస్తోంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మరుక్షణం నుంచే ప్రవర్తన నియమావళి అమల్లోకొస్తుంది. ఈ కోడ్‌ పార్టీల దూకుడుకు ముకుతాడు వేయడానికి తప్ప కఠిన చర్యలు తీసుకోడానికి ఉపకరించదు. దీనికి బదులు ఆర్టికల్‌ 324 ప్రకారం అడుగు ముందకేస్తే అనేక ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు.

ప్రజల సందేహాలకు సమాధానాలివ్వరా..?

కానీ .. ఈసీని ఇప్పుడు సునీల్ అరోరా నడుపుతున్నారని.. ఎవరూ అనుకోవడం లేదు. ఆయన పేరుతో.. ఇతరులు ఈసీని నడుపుతున్నారు. దక్షిణాదిలో జరిగిన ఎన్నికల నిర్వహణ తీరు ఇదే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్ష సంబంధం లేదని ఇంటలిజెన్స్ డీజీని తప్పించి.. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించడం దేనికి సంకేతం..!. ఓ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కారణం లేకుండా తొలగించడం.. ఎంత వరకు.. సమంజసం. చివరికి ఏపీలో ఎస్‌ఐలను కూడా.. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలతో బదిలీ చేయడం ఏమిటి..?. తమిళనాడులో ఎన్నికల డీజీపీ అంటూ ప్రత్యేకంగా ఓ హోదాను సృష్టించి… బీజేపీ నేతలు సూచించిన వారిని నియమించడం ఏమిటి..? ఇలా చెప్పుకుంటూ పోతే… ఈసీ తీరు.. ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close