ఆయన కాంగ్రెస్ – ఆమె ఎస్పీ ..! ఇద్దరి లక్ష్యం బీజేపీ..!

షాట్ గన్ శతృఘ్న సిన్హా అంటే చాలా మంది బీజేపీనే గుర్తుకు వస్తుంది. ఓ దశలో బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఆయన పోటీ పడ్డారు. కానీ బీజేపీ మోడీ చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత.. బీహార్‌లో సుశీల్ కుమార్ మోడీ అనే నేతకే ప్రాధాన్యం దక్కింది. షాట్ గన్ వెనక్కిపోయారు. చివరికి ఆయనకు టిక్కెట్ కూడా నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి.. తన నియోజకవర్గం అయిన పాట్నా సాహిబ్ నుంచే పోటీ చేస్తున్నారు. తనను అవమానించిన బీజేపీని అంతటితో వదిలి పెట్టాలనుకోలేదు… శతృఘ్న సిన్హా. తన భార్యను సమాజ్ వాదీ పార్టీలోకి పంపి.. యూపీలోని లక్నో నుంచి పోటీకి దింపుతున్నారు. అక్కడ బీజేపీ తరపున రాజ్‌నాథ్‌ సింగ్ పోటీ చేస్తున్నారు.

కేంద్రంలో బీజేపీని గద్దె దించే ఏకైక లక్ష్యంతో యూపీలో బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్డీ పార్టీలు పొత్తుకట్టాయి. ఇటీవల ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను కలిసిన శత్రుఘ్న సిన్హా.. తన భార్యకు అవకాశం కల్పించాలని కోరారు. అందుకు వెంటనే సమ్మతించిన అఖిలేష్.. రాజ్‌నాథ్‌పై తమ కూటమి తరుపున పూనమ్‌ను పోటీకి దించారు. సామాజిక సమీకరణాలు కూడా.. షాట్ గన్ భార్యకు కలసి వస్తున్నాయి. శతృఘ్న సిన్హా, పూనమ్ వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వారు. ఈ రెండు వర్గాలకు చెందిన ఓట్లు లక్నోలో.. 4 లక్షల మమంది ఉన్నారు. ముస్లిం ఓట్లు మూడు లక్షల వరకూ ఉంటాయి. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే 6న అక్కడ పోలింగ్ జరగనుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాం నుంచే లఖ్‌నవు బీజేపీకి కంచు కోటగా ఉంది. వాజ్‌పేయి తర్వాత లాల్జీ టాండన్‌ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో రాజ్‌నాథ్‌ సింగ్ ఇక్కడి నుంచి గెలిచారు. ఇలాంటి చోట బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు పూనమ్‌ను రంగంలోకి దించడంతో పోటీ రసవత్తరంగా మారింది.

యూపీలో సామాజిక సమీకరణాలే కీలకం. ఎస్పీ, బీఎస్పీ పొత్తు తర్వాత… బీజేపీకి అగ్రవర్ణాల్లో .. కొన్ని వర్గాలు మాత్రమే మద్దతుగా నిలబడుతున్నాయి. ముస్లింలు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలన్నీ ఆ కూటమి వైపే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా.. బీజేపీ అభ్యర్థుల గెలుపు అంత సులువు కాదన్న ప్రచారం జరుగుతోంది. బరిలో ఎంత పెద్ద నేత ఉన్నా.. అక్కడ ఓట్లు మాత్రం.. చరిష్మా ద్వారా రావడం కష్టం. అందుకే. యూపీలో ఈ సారి బీజేపీ.. ఎక్కడ లేని టెన్షన్ ఎదుర్కొంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close