మోడీ ప్రధాని కాక ముందే భారత్ కూడా శ్రీలంకలాగే ఉండేదట..!

మోడీగారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఇండియా ఎలా ఉండేది..?. ఈ ప్రశ్నకు.. ఎవరి.. సబ్జెక్ట్‌గా తగ్గట్లుగా వారు సమాధానం చెబుతారు. విద్యావేత్తలు… తమ దేశం సాధించిన గొప్ప.. గొప్ప ఆవిష్కరణల గురించి చెబుతారు. ఆర్థిక వేత్తలు.. దేశం సాధించిన పురోగతిని విశ్లేషిస్తారు. పారిశ్రామిక రంగ ప్రముఖులు… అదో స్వర్ణయుగం అంటారు. కానీ.. మోడీ మాత్రం… తాను అధికారంలోకి రాక ముందు.. ఇండియా ఎలా ఉందంటే.. ఏం చెబుతారనుకున్నారు…?. ఇప్పుడు శ్రీలంక ఎలా ఉండేదో… భారత్ అలా ఉండేదట. బాంబు పేలుళ్లతో .. ఉగ్రదాడులతో అతలాకుతలమైపోతున్న శ్రీలంకను.. చూసి.. భారత్ ఒకప్పుడు అలా ఉండేదని చెప్పడానికి.. సామాన్యులకే మనసు రాదు. కానీ..మోడీ మాత్రం.. అలా అనేశారు.

ఉగ్రదాడులతో అతలాకుతలమైపోతున్న ఇండియాను.. తానే కాపాడినట్లు… ప్రకటించుకోవడానికి మోడీ… శ్రీలంక దాడులను కూడా వాడుకున్నారు. మహారాష్ట్రలో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మోడీ.. భారత్‌పై ఇలా కించపరిచే మాటలు మాట్లాడారు. వందల మంది ప్రాణాలు తీసిన కొలంబో పేలుళ్ల తరహా పరిస్థితి.. 2014కు ముందు దేశంలో ఉందని చెప్పుకొచ్చారు. ముంబై, పుణె, హైదరాబాద్‌లాంటి చోట్ల పేలుళ్లు జరుగుతూనే ఉండేవట. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పరిస్థితిని మార్చారట. పఠాన్ కోట్ , ఉరి, పుల్వామా.. ఇలా.. ఎన్నో భారీ.. ఉగ్రవాద ఘటనలు మోడీ హయాంలో జరిగాయి. కానీ.. ఆయన మాత్రం.. చరిత్రలో జరిగిన వాటిని మాత్రమే చెబుతున్నారు. అయినా అసలు ఈ సందర్భంలో.. శ్రీలంక పరిస్థితి దౌర్భాగ్యంగా ఉందని.. వెటకారం చేయడమే కాదు… ఆ దేశంలా ఒకప్పుడు భారత్ ఉండేదంటూ.. చెప్పుకు రావడం… అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

శ్రీలంకకు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలుపుతున్న కొలంబో పేలుళ్లను కూడా.. మోదీ రాజకీయానికి వాడుకుకోవడాన్ని విపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. రాజకీయం కోసం మోదీ ఎంతకైనా దిగజారుతారనేందుకు..కొలంబో పేలుళ్లపై వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకునేకొద్దీ..మోడీ ప్రధాని స్థాయిని దిగజార్చుకుని మరీ రాజకీయాలు చేస్తున్నారు. ప్రకటనలు చేస్తున్నారు. ఇది ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది. అయితే మోడీ మాత్రం తన దారిలో తాను వెళ్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close