తెలంగాణ ఇంట‌ర్ వ్య‌వ‌హారం‌పై చంద్ర‌బాబు ఏమ‌న్నారు?

తెలంగాణ ఇంట‌ర్ బోర్డు నిర్వాకంపై ఇంకా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రీ వెరిఫికేష‌న్ కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించినా… నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద జ‌న‌సేన కార్య‌ర్త‌ల‌కు నిర‌స‌న‌కు దిగారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కి న్యాయం జ‌ర‌గాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోప‌క్క‌, ఇంట‌ర్ బోర్డు కార్యాలయం ద‌గ్గ‌ర ఐద్వా కార్య‌క‌ర్త‌లు కూడా నిర‌స‌న చేస్తున్నారు. రాజ‌కీయ పార్టీలు కూడా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వ అల‌స‌త్వాన్ని త‌ప్పుబ‌డుతున్నాయి. రెండోసారి ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్ పాల‌న‌ను గాలికి వ‌దిలేశార‌న‌డానికి ఇదే సాక్ష్య‌మంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు.

పార్టీ నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు మాట్లాడుతూ… తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా అక్క‌డి ప్ర‌భుత్వం స‌రిగా నిర్వ‌హించ‌లేక‌పోయింద‌ని వ్యాఖ్యానించారు. విద్యార్థుల జీవితాల‌తో ఆడుకునే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌న్నారు. ఇంట‌ర్ ఫ‌లితాల నేప‌థ్యంలో అక్క‌డి ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హిస్తే… ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌డం లేద‌నీ, కానీ తాను ఏపీలో రోజువారీ పాల‌న‌లో భాగంగా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసే ప‌రిస్థితి ఉంద‌న్నారు. తాను స‌మీక్ష‌లు చేస్తుంటే నానా యాగీ చేసేందుకు ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. ఎన్నిక‌ల సంఘం ఇష్టానున‌సారంగా వ్య‌వ‌హ‌రిస్తే ప‌రిపాల‌న అస్త‌వ్య‌స్థంగా మారుతుంద‌ని చంద్ర‌బాబు అన్నారు.

అధికార దాహంతో ఏపీలో ఎన్ని అరాచ‌కాలు చెయ్యాలో అన్నీ వైకాపా చేసింద‌నీ, వాట‌న్నింటినీ స‌మ‌ర్థంగా తిప్పికొట్టామ‌న్నారు సీఎం. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ప్ర‌చారం చేసుకున్నా, విమ‌ర్శ‌లు చేస్తున్నా టీడీపీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని మ‌రోసారి చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఈవీఎంల ప‌నితీరుపై చేస్తున్న పోరాటం ఇప్ప‌టికాద‌నీ, దేశ‌వ్యాప్తంగా ఎన్నో రాజ‌కీయా పార్టీలు కూడా ఈ పోరాటంలో భాగ‌స్వాములుగా ఉన్నార‌ని చెప్పారు. గ‌డ‌చిన ఐదేళ్లుగా అధికారులు త‌న‌కు ఎంత‌గానో స‌హ‌క‌రించానీ, కానీ ఇప్పుడు అధికారుల మ‌ధ్య చిచ్చుపెట్టేందుకు ఈసీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కాగానే వెంట‌నే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉంటాయ‌నీ, వాటి కోసం టీడీపీ శ్రేణుల‌న్నీ సిద్ధంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా పార్టీ కేడ‌ర్ కు చంద్ర‌బాబు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబుతో ఫోన్‌ మాట్లాడేందుకు జగన్ నిరాకరణ !

ప్రమాణ స్వీకారానికి రావాలని సంప్రదాయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి రాలేదు. జగన్ కు ఫోన్ లేదు. కానీ ఆయన ఆయన పీఏలు.. ఇతరులకు.. ఉంది. అందుకే...

రెడ్ బుక్ రాసుకోవాల్సింది కేటీఆర్ కాదా ?

రెడ్ బుక్ రాస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఎందుకంటే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని.. బీఆర్ఎస్ నేతల్ని వేధిస్తున్నారని వారి...

పరస్పర గౌరవం కూటమి బలం !

రాజకీయాల్లో కూటముల మధ్య పొరపొచ్చాలు రావడానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. చిన్న చిన్న సమస్యలు చాలు. రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబుకు ఇది బాగాతెలుసు. అందుకే కూటమి విషయంలో ఆయన వ్యవహారశైలి...

చంద్ర‌బాబుకూ జ‌గ‌న్‌కూ అదే తేడా!

జ‌గ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో చిత్ర‌సీమ‌ని అస్స‌లు ప‌ట్టించుకోలేదు. క‌నీసం గౌర‌వం కూడా ఇవ్వ‌లేదు. చిరంజీవి దండం పెట్టినా - ప్ర‌తిన‌మ‌స్కారం చేయ‌ని సంస్కార హీనుడిగా ఆయ‌న చ‌రిత్ర‌లో నిలిచిపోయాడు. ఇండ‌స్ట్రీ నుంచి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close