గ్లోబరీనాను కాపాడందుకు ముగ్గురు టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటున్న కోదండరాం..!

ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి, ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలకు.. ముగ్గురు టీఆర్ఎస్ పెద్దలే కారణమని.. తెలంగాణ జన సమితి నేత కోదండరాం ఆరోపించారు. గ్లోబరీనా సంస్థ గతంలో లేదని.. ఆ సంస్థకు ఇంటర్ విద్యార్థుల డేటాను ఎంటర్ చేసే సామర్థ్యం లేదని.. కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ విద్యాసంవత్సరం ఆరంభం నుంచ ిఅన్నీ తప్పిదాలే చేస్తోందని గుర్తించారు.

ఇంటర్ బోర్డు నుండి మార్కుల డాటా స్వీకరించి అప్డేట్ చేయలేదు.. దీనిపై కాలేజీల నుండి ఎన్నో ఫిర్యాదులు అందాయి అయినా ఇంటర్ బోర్డ్ అధికారులు సరిగా స్పందించలేదున్నారు. ఫీజ్ డిటేల్స్ సిస్టంలో సరిగా ఎంటర్ చెయకపోవడంతో .. ఫీజు తేదీ ముగిసినా ఎంత మంది ఫీజ్ కట్టారో బోర్డ్ కు సమాచారం అందించలేక పోయిందిని కొత్త విషయాన్ని బయట పెట్టారు.

విద్యార్థుల ఆన్సర్ షీట్లు ఇచ్చిన తర్వాత కూడా మార్కులు సరిగా ఎంటర్ చేయలేక ఫలితాల వెల్లడికి పదిహేను రోజులు గడువు కోరారని… చెప్పారు. గ్లోబరీనా సంస్థను కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రయత్నిస్తున్నారని కోదండరాం ఆరోపిస్తున్నారు.

గ్లోబరినాపై చర్యలు తీసుకుని.. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని టీజేఎస్ అధినేత డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. బోర్డు తీరుపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామన్నారు. టీఆర్ఎస్ లో ముగ్గురు పెద్దలు ఈ సమస్యకు కారణమని.. వారిని కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ గా మార్చారని మండిపడ్డారు.

ఇంటర్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడినప్పటి నుంచి గ్లోబరినా సంస్థపైనే… అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక సాంకేతిక లోపాలు బయటపడటంతో పాటు…అడ్డదారిలో కాంట్రాక్ట్ పొందాలనే ప్రచారమూ జరిగింది. అయితే.. అధికారులు మాత్రం.. గ్లోబరీనా సంస్థపై ఈగ వాలనీయడం లేదు. సీఎం కేసీఆర్ చేసిన సమీక్షలోనూ… ఇదే అభిప్రాయం చెప్పారు. గ్లోబరీనా సంస్థపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. పైగా… టెండర్లు అన్నీ నిబంధనల ప్రకారమే ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పెవరిదో బయటపడకుండా.. ఫెయిలయిన విద్యార్థుల పేపర్లు రీవెరీపికేషన్ చేసి సమస్యను సద్దుమణిగేలా చేయాలనుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close