ఐఏఎస్‌లను విభజిస్తున్న ఏపీ రాజకీయం..! వాళ్లదే స్వయంకృతం..!

ఏపీలో అఖిలభారత సర్వీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతుంది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పదవిలో ఉండగానే… ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం … ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఠా కట్టే సంప్రదాయాలకు తెరతీయడం.. అనూహ్య పరిణామాలకు దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాతీర్పు ఈవీఎంలలో ఉన్నప్పుడు ఇంత హడావుడి చేయడం ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎలాగూ.. ఏర్పడబోయే ప్రభుత్వానికి బద్ధులుగా ఉండాలి. అలాంటప్పుడు.. కామ్‌గా ఉండకుండా… ఎందుకిలా.. రాజకీయం చేస్తున్నారో.. చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ.. . సీనియర్ అధికారుల ఒత్తిడికి.. దిగువ స్థాయి అధికారులు మాత్రం బలైపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ ముగిసింది. అంతకు రెండ్రోజుల ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీతాను మార్చి, ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన తానే యాక్టింగ్ సీఎం అన్నట్లుగా వ్యవహరించడం మాత్రమే కాదు.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారుల సంఘానికి అధ్యక్షునిగా ఉన్న ఆయన.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా.. ఆ సంఘంతో తీర్మానం చేయించాలని అనుకున్నారు. సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ సీఎస్… మరేదో ఉద్దేశాలతో.. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రొత్సహించారని తెలుసుకున్న అనేక మంది అధికారులు సమావేశానికి రాకుండా డుమ్మా కొట్టారు. ఇప్పుడది హాట్ టాపిక్ అయింది.

ఓ వైపు వ్యవహారం.. సీఎస్ వర్సెస్ సీఎం అన్నట్లుగా మారిపోయింది. పరిస్థితులు ఏ మలుపైనా తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో… ఐఏఎస్ అధికారులను రెండుగా విడదీసే ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించమని.. కొంత మందిని ప్రొత్సహిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం, సీఎస్ కు పెరిగిన అంతరంతో వివాదాల్లో వేలు పెట్టడం ఇష్టంలేక అనేకమంది ఐఏఎస్ లు దూర.. దూరంగా ఉంటున్నారు. అయితే కొత్త ప్రభుత్వం జగన్‌దే వస్తుందని… ఆ ప్రభుత్వంలో కీలక పోస్టులు వస్తాయని.. కొంత మందిని మాత్రం… ఆకర్షించారు. వారిలో వారికే ఐక్యత లేకపోవడంతో… నేరుగా.. సీఎస్‌నే .. తన అధికారులపై నిందలేసే పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

అలీ ఎక్క‌డ‌.. క‌నిపించ‌డే?

టీడీపీ, జ‌న‌సేన నుంచి సీటు ఆశించి భంగ‌ప‌డి, వైకాపా గూటికి చేరిన‌వాళ్ల‌లో అలీ ఒక‌డు. కేవ‌లం వైకాపా త‌న‌కు సీటు ఇస్తుంద‌న్న కార‌ణంతోనే స్నేహితుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కూడా దూషించే సాహ‌సానికి ఒడిగ‌ట్టాడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close