దేనికైనా రద్దు ఉందిగా..! తెలంగాణ విద్యాశాఖకూ అదే మందు..!?

రెవిన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని.. కొన్నాళ్ల క్రితం… తెలుసుకున్న చీఫ్ మినిస్టర్ కేసీఆర్… ఆ శాఖను రద్దు చేసి.. కొత్త చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో తీరిక లేకుండా ఉన్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖపైనా ఆయన దృష్టి ఉందని చెబుతున్నారు. రెండే కాదు.. శాఖల పునర్‌వ్యవస్థీకరణ పై చాలా పెద్ద పెద్ద కథనాలే బయటకు వచ్చాయి. అందులో ఎక్కువగా వినిపించిన మాట… రద్దు. తాజాగా ఇంటర్ బోర్డులో అవకతవకలని ప్రచారం జరగాగానే… వినిపించిన మొదటి మాట… రద్దు. ఇంటర్ బోర్డు రద్దు. కానీ కేసీఆర్ అంత కంటే విశాలంగా ఆలోచిస్తున్నారు. అసలు విద్యా శాఖను ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆయన ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయని అంటున్నారు.

విద్యాశాఖలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై కూడా సిఎం గుర్రుగా ఉన్నారు. టీచర్లు స్కూళ్లకు వెళ్లడం మాని రాజకీయాల్లో వేలు పెడుతున్నారని ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్, వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారని కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. అందుకే.. ప్రక్షాళన తప్పదని చెబుతున్నారు. ప్రజలు కూడా టీచర్ల పనితీరుపై ఏ మాత్రం .. సానుకూలంగా లేరని.. వారిపై ప్రజలు కూడా ఆగ్రహంతోనే ఉన్నారని చెబుతున్నారు. ప్రజలు కూడా టీచర్లుకు వ్యతిరేకంగా ఉన్నందున విద్యాశాఖ ప్రక్షాళన చేస్తే ప్రజల మద్దతు లభిస్తుందనే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు.

విద్యాశాఖ ప్రక్షాళనలో స్కూళ్ల నిర్వహణ, టీచర్ల వ్యవహారాలను .. స్థానిక సంస్థలకు అప్పగించే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. మెత్తానికి రెవిన్యూ శాఖను రద్దు చేయాలనుకున్నప్పుడు.. కేసీఆర్ రెవిన్యూ శాఖపై ప్రజల్లో అసంతృప్తి పెరిగేలా… మీడియాలో విస్తృతమైన కథనాలు వచ్చేలా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్ బోర్డు అవకతవకలతో… విద్యాశాఖపై అలాంటి కథనాలకు అవకాశం ఏర్పడింది. ఇక ఉద్యోగులను నోరుమెదపకుండా చేసి.. తాను చేయాలనుకున్న “రద్దు”లను చేసేయడానికి కేసీఆర్ కు అడ్డంకులు లేనట్లేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close