మాపై ఎందుకీ వివక్ష..? మాకే ఎందుకు ఆంక్షలు..? .. సీఈసీకి చంద్రబాబు లేఖ..!

రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు చనిపోతూంటే… ప్రభుత్వం పట్టించుకోకూడదని.. ఏ చట్టంలో ఉందని… ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో.. ఎన్నికల కోడ్ పేరుతో.. జరుగుతున్న వ్యవహారాలపై.. లేఖలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వారం రోజుల్లో… అకాల వర్షాలు, వడగళ్ల వాన, ఎండల కారణంగా.. ఏడుగురు మరణించారని.. తీవ్రమైన ఆస్తినష్టం వాటిల్లినా ప్రభుత్వ పరంగా సమీక్షించి.. చర్యలు తీసుకునే అధికారం లేదని ఏపీ సీఈవో చెప్పడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. పోలవరం, రాజధాని నిర్మాణం, నీటి ఎద్దటి వంటి అంశాలపై.. సమీక్షలు చేసే హక్కు… ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి లేదని.. సీఈవో పేర్కొనడం ఏమిటని లేఖలో ప్రశ్నించారు. ప్రాజెక్టులపై సమీక్షల్ని అడ్డుకోవద్దని ఏపీ సీఈవోకి సూచించాలని చంద్రబాబు లేఖలో కోరారు.

ఎన్నికల సంఘం.. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిబంధనలు.. ఏపీలో అమలు చేస్తున్న నిబంధనలను పోల్చి చూపి.. ఎందుకు వివక్ష చూపిస్తున్నారని.. లేఖలో చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో యథేచ్చగా.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా.. పట్టించుకోవడం లేదని.. అదే ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం.. కనీసం పాలన సాగనీయడం లేదన్న అసంతృప్తిని చంద్రబాబు లేఖలో వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. అలాంటప్పుడు… కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్… ప్రధానికే రిపోర్ట్ చేస్తున్నారని.. అలాంటప్పుడు.. రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్.. సీఎంకు రిపోర్ట్ చేస్తే తప్పేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎంకు రిపోర్ట్ చేయవద్దని… ఏపీ సీఈవో.. ఇంటలిజెన్స్ చీఫ్‌ను ఆదేశించారని.. ఇదేం న్యాయమని ప్రశ్నించారు. అసలు అలా చెప్పడానికి సీఈవో ఎవరు అని చంద్రబాబు లేఖలో ప్రశ్నించారు.

ఎన్నికల సంఘం.. కేవలం వైసీపీ ఇచ్చే ఫిర్యాదులపైనే స్పందిస్తోందని గుర్తు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో… ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. కోడ్‌ అమల్లో ఉన్నందున.. తనకు ఎలాంటి అధికారం లేదన్నట్లుగా సీఈవో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో.. నిబంధనలు అమలు చేసే విషయంలో.. ఈసీ దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఏపీ విషయంలో.. కేంద్ర ఎన్నికల సంఘమే నేరుగా.. ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ.. ఏపీలో అమలు చేస్తున్న నిబంధనలు.. ఇంకా పోలింగ్ కానీ.. రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం లేదు. దీంతో.. అసలు సమస్య వస్తోంది. ఏపీ విషయంలో ఈసీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు బలపడేలా చేస్తున్నారు. అదే విషయాన్ని చంద్రబాబు లేఖ ద్వారా వెల్లడించారు. కానీ ఈసీ స్పందిస్తుందా.. అనేది అనుమానమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close