రవి : రాహుల్ చాలెంజర్ అయ్యాడని బీజేపీ చెబుతోంది..!

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నంత కాలం.. తమకు ఎలాండి ఢోకా లేదని… అనుకున్న బీజేపీకి ఇప్పుడు… అసలు సినిమా కనిపిస్తోంది. అప్పట్లో పప్పు.. అంటూ గేలిచేసవారు. ఈ ఎన్నికల్లో ఆ పదమే వినిపించడం లేదు. కానీ… పౌరసత్వం లాంటి వివాదాలు తీసుకు వచ్చి.. తమకు ఉన్న భయాల్ని మాత్రం బయట పెట్టుకుంటున్నారు.

రాహుల్‌ను విదేశీయుడిగా ప్రకటించేస్తే బీజేపీకి ఎదురుండదా..?

ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. ఈ సమయంలో .. కేంద్ర ప్రభుత్వ మరో రాజకీయ దుమారానికి తెరతీసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ఒక ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. గతంలోనే రాహుల్ గాంధీ దీనిపై స్పష్టత ఇచ్చారు. తానెప్పుడూ బ్రిటన్‌ పౌరసత్వాన్ని కోరడం కానీ పొందడం కానీ చేయలేదని.. స్పష్టం చేశారు. ఐతే ఇప్పుడు కేంద్ర హోంశాఖ నోటీసులపై సహజంగానే దేశ ప్రజల్లో చర్చ ప్రారంభమయింది. బీజేపీ చేస్తున్న జిమ్మిక్కుల్లో ఇదో భాగం అనుకునే పరిస్థితి వచ్చింది. రాహుల్‌ పుట్టుకతోనే భారతీయ పౌరుడన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని.. కేంద్ర హోంశాఖ చర్యను చెత్త అంటూ ప్రియాంక గాంధీ చేసిన ప్రకటనతో.. బీజేపీ నేతలకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకే రాజ్‌నాథ్.. ఇది సాధారణ ప్రక్రియ అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అప్పట్లో “పప్పు” అన్నారు.. ఇప్పుడెందుకు వణికిపోతున్నారు..?

గతంలోనూ రాహుల్‌ను టార్గెట్‌ చేస్తూ బీజేపీ నేతలు ఆరోపణలకు దిగారు. రాహుల్‌ అభ్యర్థిత్వం నుంచి గోత్రం వరకు రాద్ధాంతం చేశారు. బ్రాహ్మణడ్నని చెప్పుకుంటున్న రాహుల్‌.. త‌గిన ఆధారాలు ఇస్తాడా అంటూ ప్రశ్నించారు. రాహుల్ తల్లి సోనియా స్వదేశం ఇటలీ కావడంతో ఇట్లస్ అనే గోత్రం సృష్టించారు. అభ్యర్థిత్వం, గోత్రం నుంచి ఇప్పుడు పౌరసత్వం వరకు.. ప్రతీ విషయంలోనూ రాహుల్‌ చుట్టూ బీజేపీ వివాదాలు సృష్టిస్తూనే ఉంది. చివరికి.. రాహుల్ పై సుప్రీంకోర్టులో కేసుల వరకూ వెళ్లారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ వక్రీకరించారంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ ప్రతీసారి ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. వేటీలోనూ పస ఉండదు. అన్నీ.. అసంబద్ధ ఆరోపణలు.

రాహుల్ గాంధీనే ప్రత్యామ్నాయం అని బీజేపీనే ఒప్పుకుంది..!

రాహుల్ గాంధీకి నాయకత్వ సామర్థ్యం లేదని.. ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ ఫేస్‌గా ఉంటే.. తమ పని సులువు అవుతుందనుకున్న బీజేపీలో ఎంత అసహనం ఉందో తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. చివరికి రాహుల్ ఉనికి కూడా వారు భరించలేకపోతున్నట్లు.. పౌరసత్వ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో తెచ్చినట్లు… దేశవ్యాప్తంగా.. ఎన్నార్సీ తీసుకు వస్తామంటున్న బీజేపీ నేతలు.. చివరికి.. ఇలా.. .తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కి పేరును.. జాబితా నుంచి తొలగించి.. వారెవరూ… భారతీయులు కాదని చెప్పేందుకు.. ప్రయత్నిస్తుందేమో.. అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. రాహుల్‌పై బీజేపీ ఇన్ని ఆపరేషన్లు చేస్తోందంటే.. రాహుల్ గాంధీ.. వారనుకునే పప్పు స్థాయి నుంచి చాలా ఎదిగిపోయాడని.. వాళ్లే సర్టిఫికెట్ ఇస్తున్నట్లుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close