వంశీని పొగిడానంతే.. సుకుమార్‌ని ఏమీ అన‌లేదు: మ‌హేష్ క్లారిటీ

‘మ‌హ‌ర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో మ‌హేష్ బాబు సుకుమార్ కి ఇచ్చిన కౌంట‌ర్ గుర్తింది క‌దా? ‘వంశీ నా గురించి రెండేళ్లు ఆగాడు. ఈరోజుల్లో అలా ఆగ‌డం చాలా క‌ష్టం. రెండు నెల‌లు ఆల‌స్య‌మైనా ఆ క‌థ‌ని మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కు ప‌ట్టుకెళ్లిపోతున్నారు’ అంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా సుకుమార్‌పై కౌంట‌ర్ వేశాడు. ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్‌పై వివ‌ర‌ణ ఇచ్చాడు మ‌హేష్. `మ‌హ‌ర్షి` ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మ‌హేష్ బాబు మీడియా ముందుకొచ్చాడు. ఈ సంద‌ర్భంగా సుకుమార్ కి ఇచ్చిన కౌంట‌ర్ ప్ర‌శ్న‌గా ఎదురైంది. దానిపై మ‌హేష్ స్పందించాడు.

వంశీని తాను పొగిడాన‌ని, సుకుమార్ ని ఏమీ అన‌లేద‌ని, మీడియా ఆ స్టేట్‌మెంట్‌లో అర్థాలు వెతకద్దని అంటున్నాడు మ‌హేష్. సుకుమార్ త‌న‌కు `నేనొక్క‌డినే` అనే మంచి సినిమా ఇచ్చాడ‌ని, త‌న‌నెప్పుడూ గుర్తు పెట్టుకుంటాన‌ని, తామిద్ద‌రం ఓ సినిమా చేద్దామ‌నుకున్నామ‌ని, అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సేఫ్ జోన్‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేయాల‌న్న ఉద్దేశంతోనే అనిల్ రావిపూడి క‌థ‌కు ఓకే చెప్పాన‌ని, ఈలోగా సుకుమార్ మ‌రో సినిమా చేసి వ‌స్తాన‌న్నాడ‌ని, తామిద్ద‌రం క‌ల‌సి మాట్లాడుకున్నామ‌ని, ఈ స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింద‌ని చెప్పాడు. సో.. త్వ‌ర‌లోనే సుకుమార్‌తో మ‌హేష్ ఓ సినిమా చేస్తాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close