రఫెల్‌పై సీబీఐ దర్యాప్తు అంటే దేశానికే ముప్పు వచ్చినట్లట..!

రఫెల్ యుద్ధ విమానాల డీల్ విషయంలో జరిగిన అవకతవకల విషయంలో.. సీబీఐ దర్యాప్తు వద్దే వద్దని… సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో.. రఫెల్ డీల్‌పై సుప్రీంకోర్టు… దర్యాప్తు అవసరం లేదని ఓ రూలింగ్ ఇచ్చింది. దానిపై.. కొంత మంది.. కొత్త ఆధారాలతో .. రివ్యూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించాలా వద్దా అన్నదానిపై.. సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అవకతవకలు జరిగాయన్నదానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని… సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్లు కోరుతున్నారు. దీనిపై.. కేంద్రం మొదట కౌంటర్ దాఖలు చేయాడానికి నాలుగు వారాల సమయం కోరింది. కానీ కోర్టు మాత్రం అంత సమయం ఇవ్వలేదు. దాంతో.. కేంద్రం.. అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో… పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై.. పెద్దగా వివరాలు బయట పెట్టలేదు కానీ… తీర్పుపై రివ్యూ అవసరం లేదని పదే పదే చెప్పుకొచ్చింది. సీబీఐ దర్యాప్తు అసలు అవసరం లేదని.. కాగ్ రిపోర్టును ఉదహరించింది. అసలు కాగ్‌ రిపోర్ట్‌పైనే ఎన్నో అనుమానాలు తలెత్తాయి.

రాఫెల్ డీల్ విషయంలో… సీబీఐ విచారణ జరిగితే… దేశభద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్న రీతిలో.. మొదటి నుంచి… కేంద్రం బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని, రాఫెల్ డీల్‌లో లూప్ హోల్స్‌ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా యాంటీ నేషనల్ అనే ముద్ర వేసింది. ఇప్పుడు… విచిత్రంగా.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనూ అదే తరహా.. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ డీల్‌లో జోక్యం చేసుకున్న పత్రాలు నిజమేనని అంగీకరించినా… అవి చట్ట విరుద్ధంగా సేకరించారంటూ.. కేంద్రం వాదించింది. చట్టవ్యతిరేకంగా సంపాదించిన పత్రాల ఆధారంగా విచారణ చేపట్టడం వల్ల దేశ భద్రతతో పాటు ఆర్థిక ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని.. చివరకు ఇది దేశ ఉనికికే ఓ పెద్ద ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని అఫిడవిట్‌లో చాలా.. చాలా పెద్ద మాటలే చెప్పింది కేంద్రం.

రాఫెల్ డీల్ విషయంలో… జరిగిన ప్రతి ఒక్క డెవలప్‌మెంట్ కూడా అనుమానాస్పదమే. ఏ ఒక్కదానికి… కేంద్రం సరైన సమాధానం చెప్పలేదు. దేశ ప్రయోజనాలను సైతం పణంగా పెట్టాలనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. కేంద్రం ఏ మాత్రం చలించడం లేదు. నిజానికి సీబీఐ విచారణ చేయించి.. క్లీన్ చిట్ ఇప్పించుకునే పరిస్థితి కేంద్రానికి ఉంది. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. అలోక్ వర్మ వివాదం తర్వాత.. సీబీఐని గతంలోలా ఉపయోగించుకునే పరిస్థితి లేదన్న చర్చ నడుస్తోంది. దాంతో.. బీజేపీ సర్కార్ కూడా.. తన చేతుల్లో ఉన్న సీబీఐతోనే.. విచారణకు వెనుకడుగు వేస్తోంది. ఒక వేళ ప్రభుత్వం మారిదే.. మొదటికే మోసం వస్తుందన్న భయం కూడా కావొచ్చన్న అంచనాలు సహజంగానే రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close