మోడీ తన కంటే గొప్ప నటుడని ప్రకాష్ రాజ్ అభిప్రాయమా..?

“జస్ట్ ఆస్కింగ్” ప్రకాష్ రాజ్.. ఇప్పుడు ఢిల్లీలో నరేంద్రమోడీని అడుగుతున్నారు. ఈ ఐదేళ్లలో మోడీ.. ఏం చేశారో చెప్పాలని అడుగుతున్నారు. ఏం చేశారో చెప్పలేక.. ఆయన నటుడిగా మారిపోయారని సెటైర్లు వేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేయడానికి ప్రకాష్ రాజ్ ఢిల్లీ వెళ్లారు. తాను ఆ పార్టీలో చేరకపోయినప్పటికీ.. తనకు… ఆ పార్టీ సిద్ధాంతాలు బాగా నచ్చాయని ప్రకాష్ రాజ్ చెబుతున్నారు. దేశంలో.. ఆప్ ఒక్కటే… దేశం కోసం పని చేస్తోందన్న అభిప్రాయాన్ని ప్రకాష్ రాజ్ వ్యక్తం చేస్తున్నారు. తన స్నేహితురాలు గౌరీ లంకేష్‌ కర్ణాటకలో హత్యకు గురయినప్పటి నుంచి.. ప్రకాష్ రాజ్.. రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. బీజేపీ విధానాలను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీపై.. జస్ట్ ఆస్కింగ్ పేరుతో.. సోషల్ మీడియాలో సెటైర్లు వేసేవారు.

మోడీ … ప్రచార వ్యూహంలో.. మీడియా ఇంటర్యూలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతీ విడత పోలింగ్‌కు ముందు.. కొన్ని ఇంటర్యూలు .. మీడియాకు విడుదలవుతున్నాయి. ఇవన్నీ నాటకీయంగా ఉండటంతో… ప్రకాష్ రాజ్ .. మోడీ నటుడయ్యారనే విమర్శలు చేస్తున్నారని అనుకోవాలి. అక్షయ్ కుమార్‌తో… మోడీ ఇంటర్యూ తర్వాత… ఈ విమర్శలు మరీ ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ జరుగుతోంది. ఆ విషయాన్నే… ప్రకాష్ రాజ్ చెప్పారనుకోవాలి. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్… తనదైన స్టైల్లో ప్రచారం చేశారు. గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం మొత్తం అర్బన్ ఓటర్లే కావడంతో.. ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు.

ఇప్పుడు.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. ప్రచారం చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు ప్రకాష్ రాజ్ ఉపయోగపడతారని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ప్రకాష్ రాజకీయం… మొదటి నుంచి కాస్త తేడాగానే ఉంది. ఆయన బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు కానీ.. బీజేపీతో మిత్రులుగా ఉంటున్న వారితో సమాత్రం స్నేహం చేస్తున్నారు. బీజేపీ కోసం ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉన్న.. కేసీఆర్‌కు ఆయన బహిరంగ మద్దతు పలికారు. ఎన్నికల సమయంలో.. టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని మీడియాకు ఇంటర్యూలు కూడా ఇచ్చారు. రాష్ట్రానికో రీతిలో… ప్రకాష్ రాజ్ ప్రచార వ్యూహం ఖరారు చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close