తొలి దశ ఓటింగ్‌తో టీడీపీకి మేలే జరిగిందంటున్న చంద్రబాబు

ఎన్నికల ప్రకటన అలా వచ్చింది… ఇలా.. పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిపోయింది. ఇదీ ఏపీలో జరిగిన ఎన్నికల తీరు. నెల రోజుల్లో… ఎన్నికల నోటిఫికేషన్, అభ్యర్థుల ఎంపి, ప్రచారం.. ఇలా ప్రతీ అంశం.. రాజకీయ పార్టీలకు హడావుడి అయిపోయింది. తీరా గేమ్ ఆడేసి.. రిజల్ట్ కోసం… నెలన్నర రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ.. ఏం జరిగిందా.. అని విశ్లేషించుకుంటే.. తమకు కొంత సమయం ఉంటే బాగుండేదన్న అభిప్రాయం.. అందరిలోనూ వస్తోంది. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం… తొలి దశ ఎన్నికలతో మేలే జరిగిందని… పార్టీ నేతలకు ధీమా ఇస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా.. సమీక్షలు ప్రారంభించిన సీఎం.. రాజమండ్రి.. లోక్‌సభ పరిధిలోని అభ్యర్థులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి ఏపీలో ఎన్నికలు ఎప్పుడైనా.. చివరి దశల్లో ఉంటాయి. ముందుగా.. సమస్యాత్మక ప్రాంతాలుగా భావించే రాష్ట్రాలపైనే ఈసీ దృష్టి పెట్టి.. వాటిలో ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేది. అందుకే.. ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో మొదటగా పోలింగ్ జరిగేది. ఈ సారి మాత్రం.. కారణం రాజకీయమో.. మరొకటో కానీ.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి.. రెండు విడతల్లోనే పూర్తి చేసింది. సరైన భద్రతా బలగాలు లేకపోయినా.. కాలం చెల్లిన ఈవీఎంలతో అయినా.. పని పూర్తి చేసేసింది. కానీ.. ఉత్తరాదిన మాత్రం… సుదీర్ఘంగా కొనసాగిస్తోంది. ఏపీ , తెలంగాణలో కలిపి 42 నియోజకవర్గాలు ఉంటే.. ఒకే విడత.. అదీ మొదట్లోనే ఎన్నికలు పూర్తయ్యాయి. బెంగాల్‌లో అదే 42 నియోజకవర్గాలు ఉన్నాయి కానీ.. ఏడు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయినా అక్కడ ఎప్పటికప్పుడు హింసే.

దక్షిణాదిలో.. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి… ఈసీ ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ సారి రాజకీయ కారణాలతో.. మొదట్లోనే.. పోలింగ్ పెట్టారు. బీజేపీ తమకు అనుకూలమైన పార్టీలకు.. ముందుగానే హింట్ ఇవ్వడంతో.. ఆయా పార్టీలు ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. అలాంటిదేదో ఉంటుందని ముందుగానే… అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేయడంతో… పెద్దగా ఇబ్బంది పడలేదు. అనుకున్న విధంగా… అభ్యర్థుల ఎంపిక , ప్రచారం నిర్వహించారు. కానీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో మాత్రం.. వెనుకబడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అయినా.. సరే… మొదటి దశ ఎన్నికలతో..మంచే చేశారని చంద్రబాబు అంటున్నారు. అభ్యర్థుల పరంగా చూస్తే.. అది మంచిదే. ఎందుకంటే… సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఉంటే… వారు ఖర్చు.. రెండింతలు, మూడింతలు అయ్యేది మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుంది..?

లోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వారివే. 14సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే,తాము డబుల్ డిజిట్ స్థానాలను దక్కిచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close