దాస‌రి తాత‌… చిరు మ‌న‌వ‌డు

దాస‌రి చిరంజీవి మ‌ధ్య అనుబంధం చిత్ర‌విచిత్రంగా ఉండేది. ఓ ద‌శ‌లో ఇద్ద‌రూ గురు శిష్యుల్లా ఉండేవారు. ఆ త‌ర‌వాత‌.. చిన్న‌పాటి గ్యాప్ వ‌చ్చింది.చిరంజీవిని దాస‌రి బాహాటంగానే విమ‌ర్శిస్తుండేవారు. మేస్త్రీ సినిమా స‌మ‌యంలో దాస‌రి – చిరు మ‌ధ్య గ్యాప్ మ‌రింత ఎక్కువైంది. అయితే దాస‌రి చివ‌రి రోజుల్లో వీరి అనుబంధం బ‌ల‌ప‌డ‌డం మొద‌లైంది. చిరంజీవి 150 సినిమా ఫంక్ష‌న్ విజ‌య‌వాడ‌లో జ‌రిగితే.. దానికి అతిథిగా వ‌చ్చిన దాస‌రి చిరంజీవిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అల్లు రామ‌లింగ‌య్య జాతీయ అవార్డుని దాస‌రికి ప్ర‌క‌టించిప్పుడు.. ఆ బంధం మ‌రింత బ‌లంగా క‌నిపించింది. ఇప్పుడు దాస‌రి విష‌యంలో చిరంజీవి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పారు. ”చాలామందికి తెలియ‌ని విష‌యం. మేమిద్దం బంధువులం కూడా. మా మ‌ధ్య చుట్ట‌రికం ఉంది. వ‌రుస‌కు తాతా మ‌న‌వ‌ళ్లం అవుతాం” అని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.

దాస‌రి నారాయ‌ణ‌రావు పుట్టిన రోజుని తెలుగు చిత్ర‌సీమ డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకుంటోంది. ఈరోజు ఆ వేడుక‌లు హైదారాబాద్‌లోని ఎఫ్,ఎన్.సీ.సీలో జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా దాస‌రితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ”ఆయ‌న‌తో నేను చేసింది ఒక్క సినిమానే. ఎక్కువ సినిమాలు చేయ‌లేక‌పోయా అన్న లోటు ఉండేది. చివ‌రి రోజుల్లో మా మ‌ధ్య అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఓరోజు ఇంటికి పిలిచి బొమ్మిడాయిల పులుసుతో భోజ‌నం పెట్టారు” అని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ద‌ర్శ‌కుల సంఘానికి చిరంజీవి 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. రాజ‌మౌళి రూ.50 లక్ష‌లు, ఆర్కా మీడియా 25 లక్ష‌లు విరాళం ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close