తునిలో అల్లర్లకు పాల్పడింది కర్చీఫ్ గ్యాంగ్: ఆధారాలు లభ్యం

హైదరాబాద్: గత ఆదివారం తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను, పోలీస్ స్టేషన్‌ను, 25 ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను తగలబెట్టిన ఘటనలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు బయటకొస్తున్నాయి. ఆ రోజు జరుగుతున్న విధ్వంసాన్ని పోలీసులు చిత్రీకరించిన వీడియోల ద్వారా, కొందరు ప్రయాణీకులు, ప్రజలు చిత్రీకరించిన మొబైల్ వీడియోల ద్వారా ఈ ఆధారాలు లభిస్తున్నాయి. ప్రజలు చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చాయి. ఈ వీడియోలన్నింటినీ పరిశీలించగా కొందరు ముఖాలు కనపడకుండా కర్చీఫ్‌లు కట్టుకుని దాడలు చేయటం కనబడింది. వీరంతా కొన్ని వాహనాలలో వచ్చి దాడులకు పాల్పడ్డట్లుగా కూడా పోలీసులు వీడియోలద్వారా గమనించారు. ఈ వాహనాల నంబర్‌లను, వాటిద్వారా యజమానులను పట్టుకోవటానికి ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సభకు హాజరయ్యి, సెల్ ఫోన్ల ద్వారా తుని విధ్వంసాన్ని చిత్రీకరించిన వారు వాటిని తమకు అందించాలని పోలీసులు కాపు సామాజికవర్గానికి విజ్ఞప్తి చేశారు. కర్చీఫ్ గ్యాంగ్ దుండగులను పట్టుకునేందుకు ఏపీ పోలీసులతోపాటు రైల్వే పోలీసులు సంయుక్తంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ కేసును సీఐడీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. తుని విధ్వంసంలో మొత్తం రు.130 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సేమ్ బీఆర్ఎస్ లాగే వైసీపీకి ఓవైసీ సపోర్ట్ !

మాము కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేసుకుందామని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిలు ఎక్కువగా ఉండే ఊళ్లన్నీ తిరిగారు. కేసీఆర్ సీఎం కాకపోతే.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టారు. కానీ ఒక్కరూ...

బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోన్న ధృవ్ రాతీ..!

ధృవ్ రాతీ... సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బెసేడ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. మీడియా అంత గోది మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తోన్న వేళ ధృవ్ రాతీ...

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు..ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలివే

తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం , సాయంత్రం అనే తేడా లేకుండా భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. మే నెల ప్రారంభమైన మొదటి రోజే భానుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close