అరాచకత్వం ప్రబలకుండా అందరూ ఒక్కటౌతున్నారు!

భాగ్యనగరంలో మజ్లిస్‌ పార్టీ అరాచకత్వం ప్రబలిపోకుండా ఇన్నాళ్లకు అన్ని పార్టీలూ ఒక్కతాటి మీదకు రావడానికి, నిర్దిష్టమైన కార్యాచరణతో మజ్లిస్‌ ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి ప్రయత్నానికి పూనుకోవడం ఇప్పుడు జరుగుతున్నది. మజ్లిస్‌ పార్టీకి చెందిన గూండాలు సాక్షాత్తూ శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌ ఆలీని దారుణంగా కొట్టడం, సాక్షాత్తూ మజ్లిస్‌ ఎమ్మెల్యే ఏకంగా.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఇంటిమీద దాడిచేసి ఆయన కొడుకును చితక్కొట్టడం, ఇంకా ఇతరత్రా జరిగిన అనేక దాడులు పాతబస్తీలో ప్రబులుతున్న అరాచకత్వానికి నిదర్శనాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే.. కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం మీదికి రావడానికి ప్రతిసారీ కొన్ని డివిజన్లను గెలుచుకుంటూ ఉండే ఎంఐఎం మీద ఆధారపడడం అనేది పెద్ద పార్టీలకు గత్యంతరం లేని స్థితిగా మారుతోంది. అందుకే పార్టీలన్నీ వారి ఆగడాల్ని చూసీ చూడనట్లుగా వెళుతుండడం సాధారణంగా జరుగుతోంది.

అయితే ఈసారి మజ్లిస్‌ ఆగడాలు శృతి మించాయనే చెప్పాలి. ఎందుకంటే.. మజ్లిస్‌ మా మిత్రపక్షమే.. అని తెరాస అధినేత చెబుతూ ఉన్నప్పటికీ.. అదే పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి కొడుకునే చితక్కొట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను చితక్కొట్టారు. ఇంత దారుణమైన ఆగడాలకు పాల్పడడంపై పీసీసీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నది.

కనీసం ఎంఐఎం ఎప్పుడో ఒకసారి తమకు ఉపయోగపడుతుంది అనే ఆశలను పక్కన పెట్టి.. ఇప్పుడు అన్ని పార్టీలూ ఎంఐఎం ఆగడాలకు బలవుతున్నాయి కాబట్టి.. అందరూ కలిసి ఐక్యంగా వారికి చెక్‌ పెట్టడానికి కార్యచరణ చర్చించుకోడానికి సమావేశం అవుతున్నారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి, అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి గులాబీ పార్టీ కూడా తోడ్పాటు అందిస్తుందా లేదా అనేది సందేహం. కాంగ్రెస్‌ పార్టీ అందరినీ పోగేస్తున్న ఈఅఖిల పక్షసమావేశానికి తెరాస దూరంగా ఉంటే మాత్రం నగరాన్ని మజ్లిస్‌ ఆగడాలనుంచి రక్షించే ఉద్దేశం వారికి లేనేలేదని, చెప్పినవన్నీ మెరమెచ్చు మాటలేనని అనుకోవాల్సి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close