కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కేసీఆర్‌కు స్టాలిన్ సలహా..!

జాతీయ రాజకీయాల్లో స్పెక్యులేషన్‌కు చాన్స్ లేకుండా… డీఎంకే అధినేత స్టాలిన్..కేసీఆర్ కు…స్పష్టతిచ్చి పంపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కూటమిని విడిచిపెట్టేది లేదని..తేల్చేశారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి… కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు.. డీఎంకే నుంచి.. గట్టి మద్దతు లభించలేదు. చెన్నై వెళ్లి డీఎంకే చీఫ్..స్టాలిన్‌తో సమావేశమైన.. కేసీఆర్… గంట పాటు.. దేశ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. ప్రస్తుత ఎన్నికల ట్రెండ్స్… ఫలితాల తర్వాత ఎలాంటి మార్పు ఉండబోతుందో.. కేసీఆర్ విశ్లేషించి… ప్రాంతీయపార్టీలన్నీ కూటమిగా మారిదే…రాష్ట్రాలకు మరింత బలం కలిగేలా… కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించవచ్చునని సూచించినట్లు సమాచారం.

ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తిని..స్టాలిన్ ప్రశంసించారు. కానీ ఇప్పటికిప్పుడు…ఫెడరల్ ఫ్రంట్ విషయంలో సానుకూల ప్రకటన చేయలేనని..చెప్పినట్లు సమాచారం. డీఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని.. యూపీఏలో భాగస్వామి. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేశాయి. కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో..రాహుల్ గాంధీనే..తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని స్టాలిన్ … పదే పదే ప్రకటించారు. .యూపీఏలోని కొన్ని ఇతర పార్టీలు…ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌తో కలుస్తాయనుకుంటున్న పార్టీలు కూడా.. రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించడానికి సిద్ధం లేని పరిస్థితుల్లో కూడా…స్టాలిన్.. రాహుల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇదే విషయాన్ని కేసీఆర్‌కు… స్టాలిన్ చెప్పినట్లు సమాచారం.

కాంగ్రెస్‌తోనే కలిసి సాగుతామని చెప్పినట్లు డీఎంకే వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. ముందుగా ప్రకటించినట్లుగా రాహుల్‌ ప్రధాని అయ్యేందుకు కూడా సహకరిస్తామని కూడా.. స్టాలిన్‌ కేసీఆర్ కు… నిర్మోహమాటంగానే చెప్పారని… కాంగ్రెస్‌ విషయంలో తమ వైఖరి మారబోదని కూడా స్పష్టం చేశారని.. డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. చివరిలో ఫలితాల తర్వాత అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను స్టాలిన్‌ కోరినట్లు తెలుస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాలన్న అంశంలో మాత్రం స్టాలిన్‌ నుంచి కేసీఆర్‌ స్పష్టమైన హామీని రాబట్టుకోలేకపోయారు. సానుకూల స్పందన లేకపోవడంతో.. కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close