పంతం నెగ్గించుకున్న చంద్రబాబు..! కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి తీరాలని పట్టుబట్టిన చంద్రబాబు పంతాన్ని నెగ్గించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం… కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, పశుగ్రాసం, మంచినీటి ఎద్దడి, ఫొని తుపాన్ సహాయక చర్యలు వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. దీనిపై సంబంధిత శాఖల నుంచి సమాచారం సేకరించి, సీఈవో ద్వారా సీఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు అనుమతి కోసం పంపారు. దీన్ని పరిశీలించి… సీఈసీ అనుమతి తెలిపింది. ఉదయం సీఎంతో సమావేశమైన సీఎస్… ఎల్వీ సుబ్రహ్మణ్యం .. కేబినెట్ భేటీ గురించి వివరించారు.

మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఎటువంటి అభ్యంతరంలేదని.. సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ మంత్రులకు ఫోన్ చేసి పిలిపించొచ్చని సీఎం కార్యాలయం భావిస్తోంది. కేబినెట్ సమావేశం ఉంటే సంబంధితల శాఖల అధికారులతోపాటు ఇతర శాఖలకు చెందిన అత్యవసర విషయాలు ఏవైనా ఉంటే టేబుల్ ఎజెండాగా చేర్చి ఆమోదించవచ్చని ప్రభుత్వంలోని కొంతమంది భావిస్తున్నారు. ఇతర పాలన వ్యవహారాలపై కూడా సీఎస్.. సీఎంకు బ్రీఫ్ చేశారు. ఫోనీ తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలు, ఒడిషాకు ఏపీ నుంచి ట్రాన్స్ కో సిబ్బందిని పంపించటం, ప్రభుత్వ సాయం, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, తదితర అన్ని అంశాలపై కూడా సీఎస్.. సీఎంకు వివరించారు.

చంద్రబాబు కేబినెట్ భేటీ పెట్టడానికి… అధికారులు కట్టు తప్పుతున్నారనే అంశమే కారణం. సీఎం అధికారాలపై ఎల్వీ వివాదాస్పద కామెంట్లు చేయడం… కీలకమైన విషయాలపై.. సొంత నిర్ణయాలు తీసుకోవడం.. సింహపురి ఆస్పత్రి విషయంలో..సీఎస్ మితిమీరిన జోక్యం చేసుకుని.. కాపాడటం వంటి అంశాలపై..సీఎం ఆగ్రహం ఉన్నారు. రివ్యూలు చేయవద్దని ఆదేశించడం.. ఇతర అంశాల నేపధ్యంలో బిజినెస్ రూల్స్ పై చర్చిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. టేబుల్ అంశంగా.. ఏమైనా తీసుకుంటారా..లేదా అన్నది.. మంగళవారం మధ్యాహ్ననికే క్లారిటీ రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close