పోలింగ్ పటాస్..! యూపీలో బీజేపీ ఆశలన్నీ ఆవిరే..!

ఉత్తరప్రదేశ్‌లో ఎవరు అత్యధిక సీట్లు సాధిస్తే వారికే అధికారం. ఇది మొదటి నుంచి ఉన్న సంప్రదాయం. గత ఎన్నికల్లో బీజేపీ యూపీలో ఉన్న 80 లోక్ సభ స్థానాల్లో 71 సొంతంగా గెలిచింది. మరో రెండు మిత్రపక్షాలకు గెలిపించి పెట్టింది.. అంటే టోటల్ స్కోర్ 73. ఇంత ఏకపక్ష విజయం ఇచ్చిన రాష్ట్రంలో ఈ సారి బీజేపీ ఎదురీదుతోంది. విపక్ష పార్టీల పొత్తులు, ఓట్ల పొలరైజేషన్‌తో… అదే రాష్ట్రం నుంచి అధికారం పోగొట్టుకుంటుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి.

పోలింగ్ బూత్‌ల వద్దకు రాని బీజేపీ మద్దతుదారులు..!

ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ శాతం తక్కువగా ఉంది. మోడీ పోటీ చేస్తున్న వారణాసి, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ నియోజకవర్గాల్లో ఆఖరి దశలో ఎన్నికలు జరగన్నాయి. ఆరో దశలో 55 శాతం పోలింగ్ జరగడం బీజేపీ నేతలకు ఓ రకంగా షాక్ ఇచ్చినట్లయింది. ఆరు దశలూ కలిపి 60 శాతం పరిసరాల్లోనే పోలింగ్ జరిగింది. ఏడో విడతలోనూ పరిస్థితి మారే అవకాశం లేదు. ఎస్పీ- బీఎస్పీ పొత్తును ఎదుర్కోవాలంటే అతి పెద్ద రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగాలని బీజేపీ అంచనా వేసుకుంది. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. యూపీలో ఏడు దశలుగా పోలింగ్ నిర్వహిస్తే అది తమకు అనుకూలిస్తుందని బీజేపీ విశ్వసించింది. కానీ బీజేపీ మద్దతుదారులైన ఓటర్లు.. పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరడం లేదు.

ఎస్పీ – బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ సక్సెస్..!?

ఎస్పీ- బీఎస్పీ మైత్రి మాత్రం బాగా వర్కవుట్ అయిందన్న ప్రచారం మాత్రం సాగుతోంది. విడతకో ప్రచార వ్యూహం పెట్టుకున్న బీజేపీకి… కంఠ శోష తప్ప… విషయం ప్రజల్లోకి చేరలేదు. సరిగ్గా ఐదో దశ పోలింగ్‌కు ముందు మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడం కలిసొస్తుందని బీజేపీ అనుకుంది. కానీ దాన్ని పట్టించుకున్నవారే లేరు. అలాగే.. ప్రతీ దశలోనూ… ఒక్కో జిమ్మిక్ బీజేపీ చేసుకుటూ వచ్చింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఏడు దశల పోలింగ్ ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు ప్రయోజనం కలిగించిందని కొన్ని సర్వేలు సారాంశం. అఖిలేశ్, మాయావతితో పాటు రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు అన్నిచోట్లకు తిరిగి ప్రచారం చేయగలిగారు. పొత్తులో భాగంగా ఎవరెక్కడ ప్రచారం చేయాలో కూడా ప్లాన్ చేసుకోగలిగారు. ఏడో దశ కోసమే ఎస్పీ, బీఎస్పీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు జరుపుతోంది.

తటస్థ ఓటర్లకు దూరమైన బీజేపీ పాలన..!

సుదీర్ఘ షెడ్యూల్ యూపీలోని తటస్థ ఓటర్లకు విసుగుపుట్టించినట్లు అక్కడి మీడియా చెబుతోంది. అక్కడ గత ఎన్నికల్లో తటస్థ ఓటర్లంతా బీజేపీకి ఓటేసినందుకే ఆ పార్టీకి 71 లోక్ సభా స్థానాలు దక్కాయి. ఇప్పుడు రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఒకే తాటిపైకి రావడంతో కమలనాథులకు ముచ్చెమటలు తప్పడం లేదు. అలాగే.. యోగి ఆదిత్యనాథ్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా మైనస్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. కింది స్థాయిలో సంఘ్ పరివార్ సంస్థలు చేస్తున్న ప్రచారం బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందని కొంత మంది నమ్ముతున్నారు. కానీ అది పరువు కాపాడుకోవడానికి సరిపోతుందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close