చంద్రబాబు ఆత్రమే..! 23కి ముందు భేటీ కష్టమే..!?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో మకాం వేశారు. మోడీని మళ్లీ ప్రధాని కాకుండా చేయాలనే లక్ష్యంతో.. చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కానీ… పరిస్థితులు అనుకూలించడం లేదు. ఫలితాలొచ్చిన తర్వాత చూద్దామన్నట్లు పార్టీలు ఉన్నాయి. కానీ.. ఫలితాలకు ముందే కూటమి కట్టాల్సిన అవసరాన్ని చంద్రబాబు నొక్కి చెబుతున్నారు.

ఫలితాలకు ముందే కూటమి కట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు..!

చంద్రబాబు ఓ వైపు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతూ.. మరో వైపు.. ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్నారు. లెఫ్ట్ పార్టీలను, కేజ్రీవాల్‌ను… బీజేపీయేతర కూటమి సమావేశానికి వచ్చేలా దాదాపుగా ఒప్పించారు. అయితే… చంద్రబాబు ప్రధానమైన మిషన్ మాత్రం మాయావతి, మమతా బెనర్జీలను ఒప్పించడమే. మాయావతిని కూటమి సమావేశానికి వచ్చేలా ఒప్పించడానికి చంద్రబాబు స్వయంగా లక్నో వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ప్రాంతీయ పార్టీలు పట్టుదలకు పోతే… మోదీ మార్క్ రాజకీయంతో… మొత్తానికే మోసం వస్తుందని… వివరించి చెప్పి.. అందర్నీ సమావేశానికి వచ్చేలా చేసేందుకు ప్రయత్నించబోతున్నారు. ఫలితాల తర్వాత… కాంగ్రెస్ నేతృత్వంలో కూటమికి మద్దతిస్తామని చెప్పినా… ప్రయోజనం ఉండదని.. ముందుగానే జాగ్రత్త పడాలని చెప్పబోతున్నారు.

మెజార్టీ లేకపోయినా మోడీ ప్రమాణస్వీకారం చేస్తే కష్టమే..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్ద పార్టీకి గా అవతరించింది. కానీ కాంగ్రెస్ – జేడీఎస్ కలిస్తే… స్పష్టమైన మెజార్టీ ఆ కూటమికి ఉంది. కానీ గవర్నర్ ఏం పెద్ద పార్టీ పేరుతో బీజేపీని ఆహ్వానించారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా యడ్యూరప్ప ప్రమాణం చేసి… కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరాలాడుతూ దొరికిపోయారు. కచ్చితంగా… మే 23వ తేదీ తర్వాత ఇదే పరిస్థితి కేంద్రంలోనూ వస్తుందని.. టీడీపీ అధినేత అంచనా వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాదు. రాష్ట్రపతి కచ్చితంగా… పెద్ద కూటమి పేరుతో… బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. బల నిరూపణకు నాలుగైదు వారాలు సమయం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ గడువులోగా… రాజ్యాంగ సంస్థలను ప్రయోగించి… బెదిరించో.. భయపెట్టో… తాయిలాలిచ్చో… కావాల్సిన మద్దతును కూడగట్టుకునే అవకాశం లభిస్తుంది. అంటే.. మెజార్టీ లేకపోయినా మోదీ ముందస్తుగా ప్రమాణస్వీకారం చేస్తే మాత్రం … ప్రాంతీయ పార్టీలు తట్టుకోవడం కష్టం. చంద్రబాబు అదే చెబుతున్నారు.

సొంత ప్రయోజనాలను ప్రాంతీయ పార్టీలు కొంత మానుకుంటాయా..?

బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే… కనీసం.. ఫలితాలు వచ్చిన రోజు అయినా… బీజేపీయేతర పార్టీలన్నీ సమావేశం అవ్వాల్సిన అవసరం ఉందని… టీడీపీ అధినేత చెబుతున్నారు. అయితే.. ఈ సారి అత్యధిక స్థానాలు సాధించి.. కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు… భేటీపై ఆసక్తి చూపించడం లేదు. పూర్తిగా ఫలితాలొచ్చిన తర్వాత సమావేశాల గురించి ఆలోచిద్దామని… వారు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరవై మూడో తేదీన ఏర్పాటు చేసే సమావేశానికి… ఈ మూడు పార్టీలు..వస్తాయా ..రావా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ మూడు పార్టీలు… బీజేపీయేతర పార్టీల సమావేశానికి వస్తే.. ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ నెంబర్లు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో… బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా.. రాష్ట్రపతిపై ఒత్తిడి తేవొచ్చని.. చంద్రబాబు చెబుతున్నారు. మరి ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలన్నీ… వ్యూహాత్మకంగా వ్యవహరించి… సొంత రాజకీయ ప్రయోజనాల విషయంలో కాస్తం పట్టు సడలిస్తే.. బీజేపీని అధికారాన్ని దూరం చేయగలుగుతారు.. లేదంటే… విపక్షాల అనైక్యతను ఆసరాగా చేసుకుని మోదీనే మరోసారి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉండదనేది రాజకీయవర్గాల అంచనా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close