ఎగ్జిట్ పోల్స్ “మెథడాలజీ” మాయ..! ఎప్పుడు నిజం అయ్యాయి..?

గత డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అంతకు ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఇంకా ముందు జరిగిన బీహార్, ఢిల్లీ, పంజాబ్ లాంటి చోట్ల… బీజేపీనే గెలుస్తుందని మీడియా బాకా ఊదింది. చివరికి ఫలితాలు తేడాగా వచ్చాయి. డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇంగ్లిష్ చానళ్లన్నీ…తెలంగాణ మినహా అన్ని చోట్లా బీజేపీ గెలుపునే ప్రకటించాయి. కానీ.. ఫలితాలు మాత్రం అనూహ్యంగా వచ్చాయి. చత్తీస్ ఘడ్‌లో అయితే ఏ ఒక్క సర్వే సంస్థ కూడా అంచనా వేయని విధంగా భారీ విజయాన్ని కాంగ్రెస్ నమోదు చేసింది. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అసలు ఆ సర్వే సంస్థల మెథడాలజీ ఏమిటన్నదానిపై చర్చ జరుగుతోంది.

తెలంగాణ వాసులకు ఫోన్ చేసి ఏపీ సర్వేనా..?

ఇండియా టుడే – మైయాక్సిస్ పేరుతో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఓ సంస్థ ఏపీలో తాము ఎంత గొప్పగా సర్వే చేశామో ప్రకటించుకుంది. తమ మెథడాలజీని ఘనంగానే చెప్పుకుంది. ఇంతకీ ఆ మెథడాలజీ ఏమిటంటే… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 15 వేల మంది ఫోన్ల ద్వారా అడిగి..సర్వేను ప్రకటించారట. ఈ మెథడాలజీ ప్రకటన చూసి.. ఇప్పటికే అభిప్రాయసేకరణల్లో పండిపోయిన వారికి .. మూర్చపోయినంత పనైంది. ఎందుకంటే… ఫోన్ల ద్వారా తీసుకునే సమాచారం ఏ మాత్రం కచ్చితత్వం లేనిదని.. అందరికీ తెలుసు. పైగా.. 15వేల మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉంటారని కూడా ఏమీ లేదు. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ పరిధిలోనే తెలంగాణ కూడా ఉంది. ఫోన్ నెంబర్లు ఏపీ సర్కిల్‌వి తీసుకుంటే.. తెలంగాణ వారికి కూడా వస్తాయి. ఈ ఫోన్ల ద్వారా సర్వే చేసి..దాన్నే.. గొప్పగా ప్రకటించేసింది.. ఆ సంస్థ. మరికొన్ని సంస్థలు ఫీల్డ్ వర్క్ పేరుతో… రోడ్డు మీద పోయేవారిని అడిగి… ఏదో ఒకటి రాసుకుని వెళ్లిపోయాయి. వాటి ఆధారంగా ఫలితాలను విశ్లేషించారు.

పదే పదే తప్పయినా ఎందుకదే మెథడాలజీ..!?

ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కాదు.. ఎగ్జిట్ పోల్స్ ను ఘనంగా ప్రకటించిన సంస్థలన్నీ.. ఇదే తరహాలో చేశాయన్న అనుమానం.. టీడీపీ వ్యక్తం చేస్తోంది. భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కు అయి విపక్ష పార్టీల నేతలు.. ముందే భేటీ కాకుండా…ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించారని అనుమానిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో.. ఏ సంస్థలు అయితే.. వైసీపీ గెలుస్తుందని.. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయో.. అవే సంస్థలు ఇప్పుడు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌, ఒడిషా, బెంగాల్‌లో.. బీజేపీకి అత్యధిక సీట్లు ఎలా వస్తాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

బలమైన భావోద్వేగం ఉంటేనే ఎగ్జిట్ పోల్స్ తరహా పరిస్థితులు..! ఇప్పుడవి ఎక్కడ..?

ఎగ్జిట్ పోల్స్ చెప్పిన తరహా ఫలితాలు వచ్చే పని అయితే.. ప్రజల్లో ఓ బలమైన భావోద్వేగం.. ముందుగానే కనిపిస్తుంది. అది అంచనా వేయగలిగేలా ఉంటుంది. 2014లో అదే జరిగింది. కానీ ఇప్పుడు అదేమీ లేకపోగా.. పేద, మధ్యతరగతి ప్రజల బతుకుల్ని చిదిమేసే నిర్ణయాలు తీసుకున్న మోదీపై వ్యతిరేకత ఉంది. అలాంటిది ఏ ప్రతిపాదికన అన్ని సీట్లు వస్తాయని ప్రొజెక్ట్ చేశారన్నది చాలా మందికి అర్థం కావడంలేదు. అందుకే టీడీపీ నేతలు… ఈ చానళ్లు అసలు సర్వేలు చేయలేదన్న అనుమానాలను టీడీపీ లాంటి పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో ఏ టీవీ చానల్ ఎగ్జిట్ పోల్ కూడా నిజం కాలేదని..చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close