కౌంటింగ్‌కి కొత్త రూల్స్..! అర్థరాత్రి తర్వాతే ఫలితాలు..!

ఎన్నికలు ఎంత వివాదాస్పదంగా జరిగాయో… అంత కన్నా ఎక్కువ వివాదాస్పదంగా కౌంటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు దగ్గర్నుంచి ప్రతీ విషయంలోనూ… అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఏపీలో అటు టీడీపీ.. ఇటు వైసీపీ రెండు పార్టీలు రెడీ అయిపోయాయి. నిబంధనలు సైతం ఈ సారి మార్చేశారు. అధికారికంగా ఫలితాలు తెలుసుకోవాలంటే… గతంలో కంటే 6-7 గంటలు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. నిజానికి లెక్కింపు రోజున ఉదయం 10-11 గంటలకు ట్రెండ్స్ తెలిసిపోతాయి. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వచ్చేస్తాయి. అప్పటికే ఎవరి పొజిషన్‌ ఏంటో అన్న దానిపై క్లారిటీ వచ్చేస్తుంది.

ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండే ప్రతి శాసనసభ స్థానం నుంచి ఐదు చొప్పున వీవీప్యాట్‌లను ర్యాండమ్‌ పద్ధతిలో ఎంపిక చేయాల్సి ఉంటుంది. వాటిలోని చిటీలను లెక్కించాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే తుది ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. అయితే సగటున ఒక్కో వీవీప్యాట్‌లో చీటీలు లెక్కించేందుకు గంట సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన గత ఎన్నికల కంటే కనీసం ఆరు, ఏడు గంటల పాటు ఫలితాలు ఆలస్యం అవుతాయని చెబుతున్నారు. ఇక్కడ మరో నిబంధన కూడా ఉంది. ఈవీఎంలలో పోలైన ఓట్లన్నింటినీ లెక్కించిన తర్వాత మాత్రమే వీవీప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రారంభం కావాలి. అంటే ఇంతకుముందు వరకు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య ఫలితం వెల్లడైతే ఈసారి అది రాత్రి 7-8 గంటల సమయంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

సజావుగా జరిగితేనే ఈ మాత్రం సమయం. ఇందులో ఎక్కడైనా పోరపాటున ఈవీఎంలో వచ్చిన ఓట్లకు.. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కకు ఒక్క అభ్యర్థి విషయంలో తేడా వచ్చినా రీకౌంటింగ్‌ చేయాలి. అప్పుడు ఫలితాల ప్రకటన మర్నాడు వరకు వెళ్లే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఈవీఎంలలో వచ్చిన ఓట్ల సంఖ్య, వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపులో వచ్చిన ఓట్ల సంఖ్య సరిపోలితేనే ఫలితాలు ప్రకటిస్తారు ఇలా ర్యాండమ్‌గా తీసుకున్న ఐదు వీవీప్యాట్ల స్లిప్పులు.. ఈవీఎమ్‌ల ఓట్ల సంఖ్యతో సరిపోవాలి. అప్పుడు తుది ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఇక రెండింటి మధ్య తేడా వస్తే.. రెండు, మూడు సార్లు లెక్కించాలి. ఇక అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్‌ స్లిప్పులనే పరిగణనలోకి తీసుకుంటారు. లోక్‌సభ ఫలితాలు ఇంకా లేట్‌ అవుతాయి. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉండే ప్రతి శాసనసభా నియోజకవర్గం నుంచి ఐదేసి వీవీప్యాట్‌లను ర్యాండమ్‌గా తీసి లెక్కించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close