జోడి నెంబర్ వన్ నరేంద్రమోడీ, అమిత్ షా..!

వరుసగా రెండో సారి సంపూర్ణ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రెడిట్ అంతా… నరేంద్రమోడీ, అమిత్ షాలదే. ఒకరు పార్టీని.. మరొకరు ప్రభుత్వాన్ని శాసిస్తూ… అత్యుతన్నత స్థాయికి తీసుకెళ్లారు. వరుసగా రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న కాంగ్రెసేతర నేతగా మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. తిరుగులేని నాయకుడిని ఆయన నిరూపించుకున్నారు. ఈ విజయం వెనుక ఉన్న ఒకే ఒక్క వ్యూహకర్త బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. మోడీకి నీడలా ఉంటూ.. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ.. వెనుక ఉండి నడిపించిన నేత అమిత్ షా.

మోడీని చూపి బీజేపీని మార్కెట్ చేసిన అమిత్ షా..!

2014లో అమిత్ షా రోల్‌కు 2019లో అమిత్ షా పాత్రకు చాలా తేడా ఉంది. ఐదేళ్ల క్రితం అమిత్ షా అప్పుడే దేశ రాజకీయాల్లోకి వచ్చారు. యూపీ ఎన్నికలకు ఆయనకు తొలి పరీక్షగా చెప్పుకోవాలి. అమిత్ షా యూపీ ఎన్నికల్లో తన వ్యూహాన్ని అమలు జరిపారు. కింది స్థాయిలో వేగవంతంగా పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీకి ఓటర్లకు మధ్య అనుసంధానకర్తలుగా కొందరు ద్వితీయ శ్రేణి నేతలను తయారు చేశారు. బీజేపీ గెలిస్తే ఒనగూరే ప్రయోజనాన్ని ఓటర్లకు చెప్పగలిగారు. ప్రతీ పోలింగ్ బూత్‌లోనూ అమిత్ షా తిరిగినంతంగా ఆయన శ్రమ పడ్డారు.

పార్టీ నలుదిశలా వ్యాపింప చేసిన అమిత్ షా, మోడీ..!

మూడు హిందీ రాష్ట్రాల్లో పార్టీ ఓడిపోయినా కూడా మోదీ, అమిత్ షా ఎక్కడా నిరాశ చెందలేదు. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో గెలిచినా సీట్లు తగ్గిప్పుడు భయపడలేదు. గుజరాత్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పై మోదీ, షా ద్వయం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ నాలుగు రాష్ట్రాల్లో గెలుపుకోసం వ్యూహాలు రచించింది. పోలింగ్ బూత్ స్థాయిలో ఎక్కడ తక్కువ ఓట్లు వచ్చాయో, ఎక్కడ పురోగమనం సాధ్యమో అంచనా వేసుకున్నారు. తమ అంచనాకు తగ్గట్టుగా పార్టీ కింది స్థాయి నేతలను సమాయత్తం చేశారు. దేశం మొత్తం బీజేపీ స్థానిక పరిస్థితులను బట్టి వ్యూహాలను అమలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రనేతలిద్దరూ తిరగని నియోజకవర్గం లేదు. మోదీకి అమిత్ షాపై అమితమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని పార్టీ అధ్యక్షుడు వమ్ము చేయలేదు. తనకు రాజ్యసభ సభ్యత్వం వచ్చిన తర్వాత అమిత్ షా మరింత ఉత్సాహంతో పనిచేశారు. రిస్క్ తీసుకుంటేనే పార్టీకి ఘన విజయం సాధ్యమని మోదీకి నూరిపోసిన వ్యక్తి అమిత్ షా. పాతతరాన్ని పక్కన బెట్టి కొత్తతరాన్ని ప్రోత్సహించడంతో పాటు గెలుపు గుర్రాలెవ్వరో నిర్ణయించడంలో మోదీకి అమిత్ షా వెన్నుదన్నుగా నిలిచారు.

ఇక దక్షిణాదిపై దృష్టి పెడతారా..?

అమిత్ షా రోల్ మరింతగా పెరగబోతోంది. అమిత్ షాకు రక్షణ శాఖ అప్పగించే అవకాశం ఉందని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అమిత్ షా అక్కడ హోమ్ మంత్రిగా పనిచేశారు. అందుకే ఆయనకు కేంద్ర హోం మంత్రి పదవి కట్టబెట్టినా ఆశ్చర్యం లేదని కొందరంటున్నారు. ఏ శాఖను అప్పగించినా మోదీ నేతృత్వంలో అమిత్ షా మరింత బరువు బాధ్యత వచ్చి పడటం మాత్రం ఖాయం. ఇప్పుడు అమిత్ షా ఇక బెంగాల్‌లో వచ్చిన విజయాన్ని సుస్థిరం చేసుకోవడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దక్షిణాదిన పార్టీని విస్తరించేందుకు ఆయన ప్రయత్నిస్తారు. వారిని ఆపడం అంత తేలిక కాదు.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close