రవి : నష్టపోయిన వాళ్లే ఇష్టంగా ఓట్లేశారు.. ! మోడీ అసాధ్యుడే..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ వియయోత్సవ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు కొత్త ఆలోచనను బయటపెట్టాయి. కార్పొరేట్ రంగాన్ని ఆయన.. పేదలను.. పేదరికం నుంచి బయటపడేసే వ్యవస్థగా భావిస్తున్నారు. అందుకే.. కార్పొరేట్ రంగానికి చేయూతనివ్వాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగానే చెప్పారు.

“కార్పొరేట్లు” దేశానికి చేస్తున్న సేవ చాలా గొప్పదా..?

దేశంలో కార్పొరేట్ రంగానికి సాయం చేయడం అంటే… ధనవంతులకు సాయం చేయడం అన్న అభిప్రాయం ఉంది. కానీ మోడీ ఇప్పుడు దాన్ని మార్చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే.. కార్పొరేట్ రంగం మీద ఆధారపడి… లక్షల ఉద్యోగులు ఉంటున్నారు. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. అయితే.. కార్పొరేట్ రంగంపై… ప్రజల్లో … అపోహలు ఉన్నాయని… కాంగ్రెస్ లాంటి పార్టీలు వాటిని పెంచి పోషించాయని.. బీజేపీ భావిస్తోంది. ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీకూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని బహిరంగంగా చెప్పిన సందర్భం లేదు . కానీ మోడీ చాలా ధైర్యంగా కార్పొరేట్ రంగానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. “ఈ దేశం లో రెండే జాతులున్నాయి …ఒకటి పేదలు …రెండోది పేదలను పేదరికం నుంచి బైట పడేయడానికి కృషి చేస్తున్న జాతి” …అని మోడీ ప్రకటించారు. పేదలను పేదరికం నుంచి బైట పడేయడానికి కృషి చేస్తున్న జాతి… కార్పొరేట్లే..!

పేదరికం తగ్గిస్తున్నది కార్పొరేట్ కంపెనీలేనా..?

మోడీ తన రాజకీయ విధానం ఏమిటో అస్సలు దాచుకోలేదు . స్పష్టంగా నే చెప్పారు . రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అనిల్ అంబానీకి మోదీ లబ్ది చేకూర్చారని కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్షాలు , మీడియా లో ఒక వర్గం మోడీని తప్పు పట్టింది . మోడీ తన విజయోత్సవ సభలో పరోక్షంగా వివరణ ఇచ్చారు . ప్రైవేటు రంగం మాత్రమే ఈ దేశం లో పేదరికాన్ని తగ్గిస్తుందని తేల్చి చెప్పారు . అందుకే ప్రైవేటు రంగానికి ప్రభుత్వం సహాయం , సహకారం అందించాలన్నారు . మన దేశం లో సామాజిక అధ్యయన కారులు ఇంకా ఇరవయ్యో శతాబ్దం ఆలోచనలకే పరిమితం అయ్యారని … వాళ్ళు అసలు ఏమాత్రం మారలేదని మోడీ ఎద్దేవా చేశారు .

మోడీ విధానాలతో నష్టపోయిన వార్ని ఎలా ఓటర్లుగా మార్చుకున్నారు..?

ఆకలితో ఉండి కూడా ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతులూ , అసంఘటిత రంగం లో ఉన్న నలభై కోట్ల మంది కార్మికులూ , సక్రమంగా పన్ను చెల్లిస్తూ , చట్టానికి బద్ధులై బతుకుతున్న మధ్యతరగతి ప్రజలూ …వీళ్లంతా ఈనాటి బీజేపీ విజయానికి కారకులు. . నిజానికి మోడీ విధానాల వల్ల నష్టపోయింది ఈ వర్గాలే . పెద్ద నోట్ల రద్దు …జి ఎస్ టి …వంటి నిర్ణయాల వల్ల ఈ వర్గాలే బాగా నలిగిపోయాయి . బాధిత వర్గాలనే తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడం నిజంగా మోడీ సాధించిన అద్భుత విజయం . అందుకు అయన ఎలాంటి వ్యూహం అనుసరించారన్నది వేరే విషయం .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close