గ్రాండ్ ఓల్డ్ పార్టీ భవిష్యత్ ఆగమ్యగోచరం..! ఏం చేస్తే పునర్వైభవం..?

భారతదేశంలో ఇప్పుడు… మోడీ హవా నడుస్తోంది. మోడీ అంటే బీజేపీ. బీజేపీ అంటే మోడీ. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు కనీస సానుకూలత కూడా చూపించడం లేదు. ఓ వైపీ బీజేపీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా.. వాటికి సంబంధించిన ఫలితాలేవీ చూపలేకపోతున్నా… కాంగ్రెస్ ఉపయోగించుకోలేకపోయింది. ఎదుగూబొదుగూ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది.

అంతకంతకూ చిక్కిపోతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ..!

ఎవరూ ఊహించని స్థాయిలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. హిందీ బెల్ట్‌తో పాటు ఆ పార్టీకి పట్టున్న ప్రతి చోట దుమ్మురేపింది.బీజేపీ ధాటికి కాంగ్రెస్‌తో పాటు అనేక పక్షాలు కకావికలం అయ్యాయి. బలంగా కనిపించిన పార్టీలు కూడా కమలం దెబ్బకు కుదేలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ మరింత ఢీలా పడింది. పక్కాగా విజయం సాధిస్తామన్న ధీమా ఉన్న చోట్ల కూడా హస్తం పార్టీ పరాజయం పాలవ్వడం ఆ పార్టీ శ్రేణులను కుంగదీస్తోంది. బీజేపీకి గట్టి పోటీని ఇస్తుందనుకున్న కాంగ్రెస్‌.. కూడా మోదీ హవా ముందు చేతులెత్తేసింది. ఈ రెండు పార్టీలు హోరాహోరీగా తలపడ్డ స్థానాల్లో బీజేపీదే పైచేయి అయింది. ఐదేళ్ల పాలన వ్యతిరేకత కాంగ్రెస్‌ ఓట్‌బ్యాంక్‌ను ఏ మాత్రం పెంచలేకపోయింది. పైగా 2014 కంటే దారుణమైన ఓటమిని ఈ ఎన్నికల్లో చవిచూసింది కాంగ్రెస్‌. దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్‌ 186 స్థానాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో గెలిచింది కేవలం 15 సీట్లు మాత్రమే. దాదాపు 171 స్థానాల్లో బీజేపీనే పైచేయి సాధించింది. బీజేపీకి కనీస పోటీ ఇవ్వలేపోయింది కాంగ్రెస్‌. ఇది 2014 కంటే దారుణమైన ఫలితం. గతంలో కాంగ్రెస్‌ 24 స్థానాలు గెలిచింది. ఇప్పుడు 9 స్థానాలు తగ్గాయి.

మోడీని తట్టుకోవాలంటే అంతకు మించిన అగ్రెసివ్ వ్యూహాలు కావాలి..!

కాంగ్రెస్‌ వ్యూహాలు మార్చాల్సిన అవసరం ఉందన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. లేకుంటే వామపక్ష పార్టీల్లాగే కనుమరుగయ్యే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్‌ మాత్రమే కాదు… బీజేపీని ఢీ కొట్టగలవనుకున్న పార్టీలు కూడా ఇపుడు కమలం దెబ్బకు కకావికలం అయ్యాయి. సమోసాలో ఆలు ఉన్నన్ని రోజులు.. బీహార్‌ లాలూ, ఆర్జేడీ ఉంటుందన్న పార్టీకి ఇప్పుడు ఘోర పరాజయం ఎదురైంది. ఇక్కడ కూడా ఎన్డీయే కూటమి.. లాంతర్‌ వెలుగులను ఆర్పేసింది. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి… శివసేన, బీజేపీలకు కనీస పోటీ ఇవ్వలేకపోయాయి. కర్నాటకలోనూ కాంగ్రెస్‌, జేడీఎస్‌లు నామమాత్రంగా మిగిలిపోయాయి. ఇక్కడ కూడా కమలానిదే జోరు..! బెంగాల్‌లో బీజేపీ ఉన్న రెండు సీట్లు ఊడ్చేస్తానన్నారు మమత. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం టీఎమ్‌సీకి షాకిచ్చాయి. తెలంగాణలో బీజేపీ.. నాలుగు సీట్లు గెలిచింది.

రాహుల్ వైదొలగడం పరిష్కారం కాదు..! చేయాల్సిందే చేయాలి..!

వరుసగా రెండోసారి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడం.. శ్రేణులే కాదు హైకమాండ్‌ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. 1950 నుంచి 1990 వరకు కాంగ్రెస్‌ ఎంత బలమైన శక్తి రాజకీయాలను శాసించిందో.. ఇపుడు ఆ స్థానంలో బీజేపీ కనిపిస్తోంది. మరో ఏడాదిలో మహారాష్ట్ర, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కూటమి పార్లమెంట్‌ ఎన్నికల్లో అదరగొట్టింది. తాజా ఫలితాలతో కాంగ్రెస్‌, ఎన్సీపీలు డిఫెన్స్‌లో పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తేరుకొని బరిలో నిలవాలంటే కూటమి వ్యూహాలు మార్చాల్సిన అవసరం ఉంది. కొత్త స్ట్రాటజీలను ఖరారు చేసుకోవాల్సిన టైమ్‌ వచ్చింది. బిహార్‌లోనూ అంతే..!. ఇప్పుడు కాంగ్రెస్ నిలబడాలంటే.. చేయాల్సిన మార్పు.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడం కాదు.. ఇంకేదో ఉంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్ వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close