సంక్రాంతి బ‌రిలో మెగా హీరో

‘చిత్ర‌ల‌హ‌రి’తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఇప్పుడు మారుతి తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రానికి ‘ప్ర‌తిరోజూ పండ‌గే’, ‘భోగి’ లాంటి పేర్లు ప‌రిశీలిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాని విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. దానికి త‌గ్గ‌ట్టుగానే ‘భోగి’ అనే పేరు కూడా సూట‌య్యేలా చూసుకుంటున్నారు. ఒక‌వేళ సంక్రాంతి బ‌రిలో నిలిచే అవ‌కాశం లేక‌పోతే… ‘ప్ర‌తి రోజూ పండ‌గే’ అనే పేరు పెడ‌తార్ట‌. సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డం ఇదే మొద‌టిసారి. మారుతి సినిమాలు కూడా ఇంత వ‌ర‌కూ సంక్రాంతికి విడుద‌ల కాలేదు. 2020 సంక్రాంతికి పెద్ద సినిమాల హ‌డావుడి బాగానే క‌నిపించే అవ‌కాశాలున్నాయి. మ‌హేష్ బాబు – అనిల్ రావిపూడి చిత్రాన్ని సంక్రాంతికే విడుద‌ల చేద్దామ‌నుకుంటున్నారు. మ‌హేష్ సినిమాతో పాటు వేరే పెద్ద సినిమాలేమైనా వ‌స్తే… సాయిధ‌ర‌మ్ తేజ్ సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకుంటాడు. లేదంటే… ‘భోగి’ రోజున బొమ్మ ప‌డ‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ‘నేల టికెట్‌’ భామ మాళ‌విక శ‌ర్మ‌ని ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. చిత్ర‌బృందం ఇంకా ఖ‌రారు చేయ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదూ కూటమికే ప్రచారం చేస్తారట !

జగన్ ఓటమి ఖాయమని తేలిపోయిందని అంచనాకు వచ్చిన భజన బ్యాచ్ లో కొంత మంది తమ పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. యార్లగడ్డ...

గ్రేటర్ లో వర్షం పడితే ఇంతేనా..!?

గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం కురిసిన కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదనీరుతో రోడ్లు, వీధులన్నీ నిండిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు వర్షం దంచి కొట్టడంతో...

ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close