చంద్రబాబు డిస్కవరీ..! జగన్‌పై సానుభూతి వల్లే వైసీపీకి గెలుపు..!

జగన్‌పై ప్రజల్లో ఉన్న సానుభూతి వల్లే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని.. చంద్రబాబు.. అంతిమంగా… టీడీపీ ఓడిపోవడానికి కారణాన్ని కనిపెట్టారు. టీడీపీ తరపున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలతో… ఆయన సమావేశం అయ్యారు. టీడీఎల్పీ నేతగా… ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎన్నుకున్నారు. పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో… 22మంది సమావేశానికి హాజరయ్యారు. గణబాబు మాత్రం… వ్యక్తిగత పనుల వల్ల రాలేకపోవడంతో.. ఆ సమాచారం పంపారు. ఈ సమావేశంలో.. పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చ జరిగింది. చంద్రబాబు కోణంలో.. జగన్మోహన్ రెడ్డి… పై ప్రజల్లో ఉన్న సానుభూతి కారణంగా.. ఒక్క చాన్స్ అని… విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల… ఆయనకు విజయం వచ్చిందని… నిర్ధారించారు.

తెలుగుదేశం పార్టీ లేజిస్లేచర్ పార్టీ నాయకుడిగా.. చంద్రబాబును.. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబుకు బదులుగా మరో సీనియర్ నేతకు అవకాశం ఇస్తారని అనుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ముందు ఉంటేనే మంచిదని ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్పడంతో… చంద్రబాబు అంగీకరించారు. అంతకు ముందు.. ప్రతిపక్ష నేతగా..అచ్చెన్నాయుడు లేదా… పయ్యావుల కేశవ్‌ను పెడతారనే ప్రచారం జరిగింది. సమావేశానికి వెళ్లే ముందు… ఉండవల్లిలోని సీఎం నివాసం ఎదుట మీడియాతో మాట్లాడిన… ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబు టీడీఎల్పీ నేతగా ఉండాల్సిందేనన్నారు. మిగతా వారి అభిప్రాయం కూడా అదే కావడంతో.. చంద్రబాబు.. ప్రతిపక్ష నేతగానే వ్యవహరించనున్నారు.

ఎమ్మెల్యేలతో.. పలు విషయాలపై మాట్లాడిన.. చంద్రబాబు… పరాజయం కారణంగా పార్టీ నేతలు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నిత్యం ప్రజల మధ్యే ఉందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని ఉటంకిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటుతో ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్.. నేడు రెండోసారి కూడా అధికారం చేపట్టిందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుదామని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ముందు ముందు చాలా సవాళ్లను.. ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఎదుర్కోవాల్సి వస్తుందని.. మనోధైర్యం కోల్పోవద్దని నేతలకు.. చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close