‘అమ్మ’ చేతుల్లో మెహ‌రీన్ కెరీర్‌

క‌థానాయిక‌ల్లో అమ్మ‌కూచీలు ఎక్కువ‌మందే ఉంటారు. ఏదైనా స‌రే.. ముందు మ‌మ్మీ చెవిలో ఊదేయాల్సిందే. అమ్మ ఆమోద ముద్ర ప‌డ‌క‌పోతే సినిమాలు కూడా చేయ‌రు. అలాంటి వాళ్ల‌లో మెహ‌రీన్ కూడా చేరిపోయింది. ఎఫ్ 2 హిట్టుతో ఇప్పుడిప్ప‌డే మెహ‌రీన్ కెరీర్ గాడిలో ప‌డుతోంది. త‌న కెరీర్‌ని స్పీడ‌ప్ చేసుకోవాల్సిన త‌రుణ‌మిది. అయితే… ఇలాంటి ప‌రిస్థితుల్లో `మ‌మ్మీ` జోక్యం ఎక్కువైపోతోంద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెహ‌రీన్ ఇటీవ‌లే త‌న మేనేజ‌ర్‌ని త‌ప్పించింది. త‌న డేట్ల‌న్నీ ఇప్పుడు `అమ్మ‌` గారే చూసుకుంటున్నారు. క‌థ‌లు విన్నాల‌న్నా, డేట్లు స‌ర్దుబాటు చేయాల‌న్నా, పారితోషికం, సెట్లో ఇవ్వాల్సిన డైటు ఇవ‌న్నీ మ‌మ్మీనే డిసైడ్ చేస్తోంద‌ని స‌మాచారం. సెట్లో కూడా త‌ర‌చూ క‌నిపిస్తోంద‌ని, మెహ‌రీన్ మ‌రీ అతిగా ఆధార‌ప‌డిపోతుంద‌ని చెవులు కొరికేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య‌తో ఓ సినిమా చేస్తోంది మెహ‌రీన్‌. ఆ సినిమా కోసం ఏకంగా 80 ల‌క్ష‌ల పారితోషికం అందుకుంటోంది. మెహ‌రీన్‌కి ఇప్ప‌టి వ‌ర‌కూ అందిన అత్య‌ధిక పారితోషికం ఇదే. నిర్మాత ద‌గ్గ‌ర గీచీ గీచి బేర‌మాడి 80 ల‌క్ష‌లు ఇప్పించుకోవ‌డం వెనుక కూడా శ్ర‌మే ఉంద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close