మోడీని జగన్ అడగడం మర్చిపోయారా..?

“కలిసిన ప్రతీ సారి ప్రధాని మోడీని ప్రత్యేకహోదా అడుగుతా..! ఎప్పుడో ఓ సారి హోదా వస్తుంది..” ఇదీ .. గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్. అయితే.. ఆయన… ప్రధాని మోదీని రెండో సారి కలిశారు. ఈ సారి ఢిల్లీకి వెళ్లలేదు. నేరుగా ప్రధానమంత్రినే ఏపీకి వచ్చారు. వచ్చింది.. శ్రీవారిని దర్శించుకోవడానికే అయినా… పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం చెప్పారు … వారి పార్టీ కార్యక్రమంలో తప్ప… అన్ని చోట్లా జగన్మోహన్ రెడ్డి… మోడీ వెంటే ఉన్నారు. కానీ… అసలు విషయం మాత్రం మర్చిపోయార.ు

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, ప్రయోజనాలు… అన్నింటికీ మించి ప్రత్యేకహోదా విషయంలో.. ప్రధాని నరేంద్రమోడీని… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడగడం మర్చిపోయారు. తిరుమలలో… ఆలయంలోకి వెళ్తున్న సమయంలో… వాళ్లిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నట్లుగా కనిపించినా… అదేమీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదని తేలిపోయింది. ఎలాంటి నివేదికలు కానీ… ఆర్థిక సాయం చేయాలనే ప్రతిపాదనలు కానీ… అడుగుతానని… చెప్పిన ప్రత్యేకహోదాను… కానీ జగన్మోహన్ రెడ్డి అడగలేదు.

నిజానికి… ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారయిన తర్వాత.. ఆర్థిక శాఖ అధికారులు ఓ వినతి పత్రాన్ని రూపొందించినట్లు ప్రచారం జరిగింది. దాని ప్రకారం.. దాదాపుగా.. రూ 75వేల కోట్లు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సి ఉందని.. వాటిని తక్షణం మంజూరు చేయాలనే ప్రతిపాదనతో.. ఆ వినతి పత్రం తయారు చేసినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. కానీ.. దాన్ని ప్రధానికి ఇచ్చినట్లుగా.. ఎక్కడా లేదు. నిజానికి మోడీతో.. జగన్ భేటీ ఉంటుందన్న ప్రచారం జరిగింది. అధికారికంగా ఎలాంటి భేటీ ఏర్పాటు చేయలేదు. బహుశా వినతిపత్రాన్ని అందుకే ఇవ్వలేదు కావొచ్చంటున్నారు. మొత్తానికి .. జగన్మోహన్ రెడ్డి… మోడీ పర్యటనలో… అధికార మర్యాల ప్రకారమే పాల్గొన్నారు కానీ… వచ్చిన అవకాశాన్ని ఏపీ ప్రయోజనాల కోసం వెచ్చించలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close