వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వచ్చేది 12 అసెంబ్లీ సీట్లేనా..?

అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎప్పుడు జరిగినా …పన్నెండు సీట్లే వస్తాయట. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పినమాట. అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారంటే.. దానికి… ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు చూపిస్తున్నారు. నిజంగా నిజం.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లే.. ఏపీలోనూ జరిగి తీరుతుందంటున్నారు. కేసీఆర్ మిత్రుడు .. జగన్ చెప్పిన లాజిక్‌లోనే… అది ఉంటుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో.. తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలైంది. దానికి కారణం ఏమైనా కానీ.. యాధృచ్చికంగా.. టీడీపీకి 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు లోక్‌సభ ఎంపీలు మాత్రమే విజయం సాధించారు. టీడీపీ బ్యాడ్‌లక్ ఏమిటంటే… కచ్చితంగా… ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు…. ముగ్గురు ఎంపీలు… వైసీపీ నుంచి టీడీపీ వైపు వచ్చారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అధికారికంగా.. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఫలితాల్లో.. ఆ ఇరవై మూడు సంఖ్య మాత్రమే టీడీపీకి మిగిలింది. ఇది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చింది. అందుకే.. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని.. అందుకే.. టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయని చెప్పడం ప్రారంభించారు. దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడని.. ఎక్కడ సందర్భం వచ్చినా చెబుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఇదే చెబుతున్నారు. పొరుగు రాష్ట్రంలో.. తెలుగుదేశం పార్టీకి జరిగినట్లుగా… తెలంగాణలో టీఆర్ఎస్‌కు జరుగుతుందని… చెబుతున్నారు. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో ఆ పన్నెండు మందే మిగులుతారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో… 97 లక్షల మంది టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి 77 లక్షలకు పడిపోయారని.. తిరుగుబాటుకు ఇదే సంకేతం అంటున్నారు.

ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి… తెలంగాణ సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ రాజకీయాలను… ఆయన మీడియా బహిరంగంగానే సమర్థిస్తోంది. ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని.. ఉత్సాహంగా కథనాలు రాస్తున్నారు. లెక్క ప్రకారం అయితే.. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కను… సాక్షి చెప్పాల్సింది.. ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో చెబుతోంది అదే కాబట్టి…! కానీ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మరి పన్నెండు సీట్లే వస్తాయా.. ఎక్కువ వస్తాయా అన్నదానిపై.. మళ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేదాకా.. ఉత్కంఠగా ఎదురు చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close