“టీవీ9” హవాలా పుత్రిక .. ! హైకోర్టులో రవిప్రకాష్ వాదన..!

“టీవీ9” అనే బ్రాండ్‌కు.. పెట్టుబడిదారులు ఎవరైనా… దాన్ని ప్రజలకు చేరువ చేసింది మాత్రం రవిప్రకాష్. రవిప్రకాష్ వల్ల టీవీ9 దేశవ్యాప్తంగా విస్తరించింది. అలాగే.. రవిప్రకాష్ కూడా.. మీడియా ప్రముఖుడు అయిపోయారు. డబ్బులు మాత్రమే వేరేవాళ్లు పెట్టారు. మొదటి నుంచి యాజమాన్య అధికారాలు అన్నీ రవిప్రకాష్ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు వేరేవాళ్లు ఆ చానల్‌ను కొనుగోలు చేసి బలవంతంగా బయటకు పంపేశారు. అంతే కాదు.. అక్రమాలకు పాల్పడ్డారని మూడు కేసులు పెట్టారు. నేడో రోపే జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు.. తనను తాను కాపాడుకోవడానికి.. టీవీ9 గురించి పూర్తి వివరాలు కోర్టులో చెబుతున్నారు.

అక్రమంగా తరలి వచ్చిన సొమ్ముతో టీవీ9 స్థాపన..!

టీవీ9 అనే టీవీ చానల్ తెలుగు మీడియాలో ప్రారంభమైనప్పుడు ఓ సంచలనం. ఆ చానల్‌లో… రవిప్రకాష్‌ కానీ.. మరొకరు కానీ పెట్టుబడులు పెట్టలేదు. అప్పటికీ జర్నలిస్టులుగా జీతాలకు పని చేసుకునే కొంత మంది ఔత్సాహికులు రవిప్రకాష్ సారధ్యంలో బృందంగా ఏర్పడ్డారు. ఇన్వెస్టర్ అయిన శ్రీనిరాజు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆయన వెంచర్ క్యాపిటలిస్ట్ మాత్రమే. ఆయనకు ప్రాజెక్ట్ నచ్చడంతో.. పెట్టుబడి ఇచ్చారు. కష్టం… వాళ్లది కాబట్టి.. వాళ్లకు వాటాలు ఇచ్చారు. శ్రీనిరాజు ఒక్కరే కాదు.. మరో మారిషస్ కంపెనీ నుంచి రూ. 60 కోట్లు వచ్చాయి. ఆ మారిషస్ కంపెనీ విదేశీ పెట్టుబడుల చట్టాలన్నింటినీ ఉల్లంఘించి నిధుల వరద పారించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మరీ వచ్చిన నిధుల గురించి.. రవిప్రకాష్ ఇప్పుడు బయట పెట్టారు. నేరుగా కోర్టులోనే జడ్జి ముందు ఈ విషయాన్ని ఉంచారు. సాధారణం.. మారిషస్ లాంటిదేశాల నుంచి ఇండియాలోకి వచ్చే సొమ్ము ఏదైనా ఉందా అంటే.. అది.. ఇండియా అక్రమంగా సంపాదించిన సొమ్మును.. హవాలా మార్గంలో తరలించి.. మళ్లీ అధికారికంగా.. ఇండియాలోకి పంపించుకుంటూ ఉంటారు. అచ్చంగా శివాజీ సినిమాలో చూపించినట్లు. ఇప్పుడు.. టీవీ9 స్థాపన సమయంలో వచ్చిన మారిషస్ సొమ్ము ఎవరిది అన్నది కూడా… రవిప్రకాష్ చెప్పాల్సి ఉంది.

టీవీ9 అమ్మకము జరిగిందీ హవాలా సొమ్ముతోనేనా..?

రవిప్రకాష్ టీవీ9 అమ్మకపు లావాదేవీల గుట్టును కూడా… హైకోర్టులో న్యాయమూర్తి ముందు ఉంచారు. టీవీ9 అమ్మకం… వ్యవహారంలో… రూ. 294 కోట్ల నగదు చేతులు మారిందని..ఈ లావాదేవీ పూర్తిగా … నగదు రూపంలో .. హవాలా మార్గంలో నడిచిందని.. ఆరోపించారు. ఇంత దారుణం అంటే.. ఉగ్రవాదులకు.. నిధులు సరఫరా చేసే హవాలా నెట్‌వర్క్.. ద్వారా నిధులు తరలించారని.. ఆరోపపించారు. టీవీ9ను.. రూ. 500 కోట్లకు .. కొనుగోలు చేశారు. అంతర్గతంగా.. హవాలా ద్వారా.. బయటకు తెలియకుండా.. లావాదేవీ పెద్ద మొత్తంలో జరిగిందని రవిప్రకాష్ నేరుగా కోర్టుకు తెలియచేయడంతోనే కలకలం రేగింది.

సీబీఐ, ఈడీలకు ఆధారాలతో రవిప్రకాష్ ఫిర్యాదు..!

ఈ మొత్తం వ్యవహారంపై.. పక్కా ఆధారాలతో.. సీబీఐ, ఈడీలకు… రవిప్రకాష్ ఫిర్యాదు చేశారు. చేసినప్పటి నుంచే.. తెలంగాణ ప్రభుత్వం తనను వెంటాడుతోందని.. రవిప్రకాష్ చెబుతున్నారు. తమ అక్రమాలు బయటకు రాకుండా ఉండటానికే తప్పుడు కేసులతో .. అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందని.. రవిప్రకాష్ చెబుతున్నారు. మొత్తానికి టీవీ9 అమ్మకం వివాదంలో… తను కేంద్రంగా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో.. ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని రవిప్రకాష్ అనుకుంటున్నారు. అందుకే కోర్టులో ఈ తరహా వాదనలు వినిపించారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close