అంచనాలు తగ్గించి పోలవరం పూర్తి చేస్తే జగన్‌కు సన్మానం : అచ్చెన్న

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. అసెంబ్లీలో తొలి పంచ్‌ను.. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమయింది. తీర్మానాన్ని వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రవేశ పెట్టారు. విప్ బూడి ముత్యాలనాయుడు బలపరిచారు. ఇద్దరూ తమ ప్రసంగంలో.. టీడీపీ పాలనపై అనేక విమర్శలు చేశారు. అందులో ప్రాజెక్టులు, కాంట్రాక్టులు.. పట్టిసీమ, పోలవరం వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత టీడీపీ తరపున అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ సమయంలో.. పోలవరం ప్రాజెక్ట్‌పై.. అచ్చెన్న వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేలన్నట్లుగా సాగింది.

అసెంబ్లీలో వైసీపీ వర్సెస్ అచ్చెన్న..!

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. అంచనాలు పెంచి.. టీడీపీ సర్కార్ దోపిడీకి పాల్పడిందని కాంట్రాక్టర్లకు మేలు చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ విమర్శలపై.. అచ్చెన్నాయుడు.. సూటిగా స్పందించారు. ఇప్పుడు అంచనాలు తగ్గించి.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే.. సన్మానం చేస్తామని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వైసీపీ నేతలు పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను.. రూ. 30వేల కోట్ల మేర పెంచి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వాటినే అసెంబ్లీలో చేశారు. అయితే.. పెరిగిన అంచనాలు మొత్తం.. సహాయ, పునరావసానికి సంబంధించినవి… మూడు రెట్లు అధికంగా పరిహారం ఇవ్వాలన్న చట్టం రావడం వల్ల.. అంచనాలు పెరిగాయని ప్రభుత్వం వాదిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. వైసీపీ నేతలు అవే విమర్శలు చేయడంతో.. అచ్చన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అంచనాలు తగ్గించి.. ప్రాజెక్టును పూర్తి చేయాలని సవాల్ చేశారు. అలా చేస్తే సన్మానం చేస్తామని.. స్ట్రాటజిక్‌గా వ్యాఖ్యానించారు.

జగన్ స్టైల్లో సన్మానం ప్రకటన చేసిన అచ్చెన్న.. !

జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి… సన్మానం అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని బయట పెడితే సన్మానం చేస్తామని .. అధికారులకు చెబుతున్నారు. కాంట్రాక్టుల్లో అంచనాలు తగ్గిస్తే.. సన్మానాలు చేస్తామని… ఆయా శాఖల అధికారులకు చెబుతున్నారు. మంచి సలహాలిస్తే.. సన్మానాలు చేస్తామని… ఉద్యోగుల సమావేశంలోనూ ప్రకటించారు. ఇలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ.. సన్మానాల గురించి చెబుతూండటంతో.. అచ్చెన్నాయుడు కూడా… అంచనాలు తగ్గించి పోలవరం పూర్తి చేస్తే.. సన్మానం చేస్తామని ప్రకటించారు.

అచ్చెన్న లెవనెత్తిన పాయంట్లపై మంత్రుల విమర్శలు..!

పట్టిసీమపైనా .. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. ఆ ప్రాజెక్ట్ పై పెట్టినంత దృష్టి పోలవరంపై పెడితే..ఈ పాటికే ప్రారంభమయ్యేదని..వైసీపీ నేతలు విమర్శలు చేశారు. అవినీతి జరిగిందన్నారు. దాంతో అచ్చెన్న.. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా.. అని రిప్లయ్ సూటిగానే ఇచ్చారు. అదే సమయంలో పట్టిసీమ వల్ల ఉపయోగం లేదనుకుంటే.. అ ప్రాజెక్ట్ ను ఉపయోగించడం మానేయాలని సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం.. కేంద్రానికి వదిలేయాలని నిర్ణయించుకుని.. ేపీకి తిరిగి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని చంద్రబాబు… తప్పు చేశారన్న వైసీపీ నేతలకూ అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. అడిగారో.. ఇచ్చారో.. ప్రభుత్వం దగ్గర రికార్డులుంటాయన్నారు. మొత్తానికి గవర్నర్ ప్రసంగంపై.. ధన్యవాద తీర్మానంపై చర్చల్లో.. అచ్చెన్నాయుడు వర్సెస్.. మిగతా వైసీపీ నేతలన్నట్లుగా సాగింది. అచ్చెన్న పాయింట్లకు సమాధానాలిచ్చేందుకు పలువురు మంత్రులు.. పలుమార్లు ప్రయత్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close