స్వామిజీకైతే రూపాయికేనా..? ఉద్యమకారునికైతే రూ. ఐదు లక్షలా..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అప్పుడప్పుడూ వివాదాస్పదమవుతున్నాయి. మూడు రోజుల క్రితం జరిగిన .. కేబినెట్‌ భేటీలో…తెలంగాణ దర్శకుడు శంకర్‌కు ఐదు ఎకరాలు, స్వరూపానంద స్వామికి రెండు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ… అసలు ధర నిర్ణయం దగ్గరే తేడా వచ్చింది. స్వరూపానందకు.. కేవలం రూపాయికే.. ఎకరం కేటాయిస్తే.. అదే.. దర్శకుడు శంకర్‌కు మాత్రం.. ఎకరం రూ. ఐదు లక్షలుగా నిర్ధారించారు. దాంతో.. ఉద్యమకారుల్లో ఆగ్రహం కనిపిస్తోంది.

ఉద్యమానికి శంకర్ సాయం.. మరి స్వామిజీ ఏం చేశారు..?

తెలంగాణ ఉద్యమం ఉద్ధృతం అవడానికి.. దర్శకుడు ఎన్.శంకర్ తన వంతు సాయం చేశారు. కోట్లలో బడ్జెట్ అవుతుందని తెలిసినా.. పెట్టిన పెట్టుబడి తిరిగిరాదని తెలిసినా.. ఆయన “జైబోలో తెలంగాణ” అనే సినిమా తీశారు. ఖర్చు ఎక్కువైనా జగపతిబాబు, స్మృతి ఇరానీ లాంటి నటుల్ని పెట్టుకుని రిచ్‌గా సినిమా తీశారు. అనుకున్నట్లుగా ఆ సినిమా ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపిది కానీ..శంకర్ జేబుకు చిల్లు పెట్టింది. అయినప్పటికీ.. ఉద్యమం కోసం… తన వంతు సాయం చేశానన్న సంతృప్తితో ఆయన ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన.. సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా కావాలనుకున్నారు. స్టూడియో నిర్మించడానికి స్థలం కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఇప్పటికి… ప్రభుత్వం కరుణించి … మోకిల్లలో ఐదు ఎకరాలు కేటాయించింది. దానికి కూడా రూ. ఐదు లక్షలను ధరగా నిర్ణయించింది. శంకర్ తో పాటే… స్వరూపానందకు.. రెండు ఎకరాలు కేటాయించిన సర్కార్.. ధరను రూపాయి మాత్రమే నిర్ణయించింది. అదీ కూడా కోకాపేటలో ఇచ్చింది. ఉద్యమానికి స్వరూపానంద చేసిన సాయం ఏమీ లేదు. చివరికి.. తెలంగాణ సమాజానికి కూడా ఆయన చేసిన సాయం ఏమీ లేదు.

సినీ స్టూడియోకు కోకాపేటనే అనుకూలం..! ఆశ్రమానికెందుకు..?

శంకర్‌కు స్టూడియోకు ఇచ్చిన స్థలం.. నగరానికి కాస్త దూరంగా ఉంది. అక్కడ స్టూడియో నిర్మించిన తర్వాత షూటింగ్‌ల కోసం.. అక్కడకు వెళ్లాలంటే.. యూనిట్లకు దూరాభారం అవుతుంది. ఎందుకంటే… అవే సౌకర్యాలతో.. దగ్గరలోనే స్టూడియోలు ఉన్నప్పుడు.. అక్కడిదాకా యూనిట్లు వెళ్లాల్సిన అవసరం ఏముంది…?. అదే కోకాపేట దగ్గర… శంకర్ కు స్థలం కేటాయించిటన్లయితే.. బాగుండేదన్న అభిప్రాయం… సినీ వర్గాల్లోనే కాదు.. శంకర్ సన్నిహితుల్లోనూ ఉందంటున్నారు. మోకిల్ల.. సిటీకి దూరంగా.. ఉండటంతో.. అక్కడ.. ఆశ్రమానికి అనుకూలంగా ఉంటుందని… అక్కడ స్వరూపానందకు స్థలం కేటాయించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్టూడియో వల్ల అభివృద్ధి..! ఆశ్రమం వల్ల ఎవరికి అభివృద్ధి..!

శంకర్ కి రూ. ఐదు లక్షలకు ఎకరం చొప్పున ఐదు ఎకరాలు కేటాయించారు. అందులో ఆయన కోట్లు పెట్టుబడి పెట్టి.. సెట్టింగ్‌లు ఏర్పాటు చేసి.. మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. దాని వల్ల తెలంగాణలో చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంది. అంటే… అంతిమంగా తెలంగాణ సమాజానికి లాభం కలుగుతుంది. కానీ.. స్వరూపానంద ఆశ్రమం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది.. ఎవరు అభివృద్ధి చెందుతారనేది.. ఎవరికీ అర్థం కాని విషయం. స్వరూపానంద పీఠం.. ఇంత వరకూ.. చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలు కూడా ఏవీ లేదు. కేసీఆర్‌కు యాగాలు చేయడం తప్ప..! అందుకే.. శంకర్, స‌్వరూపానందలకు భూకేటాయింపుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close