ఆరు నెలల్లోనే తెలంగాణకు కొత్త సచివాలయం..! కేసీఆర్ ప్లానింగ్ అదుర్స్..!

తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించాలని.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. కేసీఆర్ అనుకుంటున్నారు. దాని కోసం చాలా ప్రయత్నాలు చేశారు. మొదట… ఎర్రగడ్డలో అనుకున్నారు. అక్కడ ఉన్న ఆస్పత్రిని… వికారాబాద్ తరలించినంత పని చేశారు. కానీ తర్వాత.. వాస్తు ప్రకారం అదీ బాగోలేదని తేలడంతో.. నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌లో కట్టాలనుకున్నారు. అది రక్షణ శాఖది కావడంతో… కేంద్రం నుంచి …తీసుకునేందుకు.. విక్రమార్క ప్రయత్నాలు చేశారు. ఎప్పటికప్పుడు.. ఇస్తామని చెబుతూ వచ్చిన కేంద్రం.. చివరికి హ్యాండిచ్చింది. అంతకు రెండింతల స్థలం వేరో చోట ఇస్తామని చెప్పినా… కేంద్రం కనికరించకపోవడంతో.. కేసీఆర్.. డైలమాలో పడ్డారు. ఈ లోపు.. ఏపీలో గవర్నమెంట్ మారడంతో.. ఏపీకి ఇచ్చిన భవనాల స్వాధీనం చకచకా జరిగిపోవడంతో… అంతే చురుగ్గా.. కేసీఆర్… కొత్త సచివాలయ నిర్మాణంపై దృష్టి పెట్టారు.

దేశం మొత్తం ట్రేడ్‌మార్క్‌గా నిలిచే డిజైన్లు..!

నూతన సచివాలయ భవనం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే… కొన్ని డిజైన్లు రెడీ చేయించారు. ముంబయికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ గతంలో ఇచ్చిన ఇండో అరబిక్‌ ఆర్కిటెక్చర్‌ నమూనాను దాదాపుగా ఫైనల్ చేశారు. అయితే.. కొద్ది రోజుల కిందట.. లే చెన్నైకి చెందిన ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్ట్‌ సంస్థ మరో నమూనా ఇచ్చింది. దాన్ని సైతం ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. దీర్ఘ చతురస్రాకారంలో ఒకే బ్లాక్‌గా, పొడవుగా ఉండే భవన నమునా కొంత వైవిధ్యంగా ఉంది. ఇటీవల మంత్రిమండలి సమావేశంలోనూ కేసీఆర్‌ ఈ నమూనా గురించి సభ్యులకు వివరించారు. మీడియా సమావేశంలోనూ ప్రదర్శించారు. ఈ రెండింటిలో ఏదో ఒక నమూనాను సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది. ఏదైనా.. రెండూ… తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాయని అంచనా వేస్తున్నారు.

ఆరు నెలల్లోనే అయిపోవాలంతే..!?

27వ తేదీన సచివాలయంతో పాటు అసెంబ్లీకి కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. పనులు టెండర్లు పిలవాలని నిర్ణయిస్తే… అదే రోజు పిలుస్తారు. పదిహేను రోజుల గడువిస్తారు. లేకపోతే.. ఇలాంటి నిర్మాణాల్లో పేరెన్నిక గన్న.. షాపూర్జీ పల్లోంజీ సంస్థకు ఇచ్చేస్తారు. ఈ రెండు భవనాల నిర్మాణాలకు సంబంధించి చర్చించేందుకు వరుసగా మూడురోజుల పాటు కేసీఆర్ అధికారులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా భవన నమూనాలు, టెండర్లు, బడ్జెట్‌ పై తుది నిర్ణయం తీసుకుంటారు. ఎవరికి ఇచ్చినా ఆరు నెలల్లో కాకపోతే.. మరో మూడు నెలల పొడిగింపుతో.. తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

ఏపీ సచివాలయం కంటే ముందే రెడీ..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త రాజధానిలో నిర్మించనున్న సచివాలయం కంటే.. ముందే.. తెలంగాణలో కొత్త సచివాలయం రెడీ కానుంది. నిజానికి అమరావతిలో శాశ్వత సచివాలయానికి పునాదులు పడ్డాయి. మొత్తం ఐదు టవర్లుగా దాన్ని నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అన్నింటికీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా వేశారు. ఇక.. చక.. చకా అంతస్తులు కట్టుకుంటూ వెళ్లడమే మిగిలింది. అయితే.. జగన్ సర్కార్ రాగానే.. ఇరవై ఐదు శాతం లోపు పనులు అయిన కాంట్రాక్టులన్నింటినీ నిలిపి వేసింది. దాంతో.. ఆ పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో.. తెలియదు కాబట్టి… ఏపీ సచివాలయం.. పూర్తయ్యే సరికి సమయం మించి పోతుంది. తెలంగాణ సచివాలయమే ముందు ప్రారంభమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close