చంద్రబాబు సర్కార్ అంచనాలకే కేంద్రం ఆమోదం..! పోలవరంపై జగన్ వైఖరేంటి..?

కేంద్ర ప్రభుత్వం.. పోలవరం విషయంలో.. గత ప్రభుత్వం ఇచ్చిన అంచనాలను యధాతథంగా ఆమోదించింది. గతంలో పోలవరం నిర్మాణ వ్యయం… 2010- 11 లెక్కల ప్రకారం వ్యయం రూ.16,010 కోట్లు ఉంది. 2017-18 ధరలను పరిగణనలోకి తీసుకుని సవరించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు సవరించారు. సవరించిన అంచనాలను ఆమోదింపచేసుకోవడానికి గత ఏపీ ప్రభుత్వం … కేంద్రంపై దండయాత్ర చేసినంత పని చేసింది. ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా సంఘం ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో.. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకే కేంద్రం సమాధానం ఇచ్చింది.

పోలవరం అంచనాలపై గతంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు..!

పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను ఏపీ ప్రభుత్వం పెంచడాన్ని.. వైసీపీ తీవ్రంగా తప్పు పట్టింది. రూ. పదహారు వేల కోట్ల నుంచి.. ఏకంగా.. యాభై ఐదు వేల కోట్లకు అంచనాలు పెంచడం అంటే… మొత్తం దోపిడీనేనని విమర్శలు గుప్పించారు. దీనిపై గతంలో… ప్రభుత్వం జీవో జారీ చేస్తే… కేంద్రం అనుమతి లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారంటూ.. మండిపడ్డారు. సాక్షి పత్రిక కూడా విస్తృతంగా కథనాలు ప్రచురించింది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతి సమావేశంలోనూ… పోలవరం అంచనాలపై విమర్శలు చేశారు. అందులో.. టీడీపీ నేతలు…. వేల కోట్లు అవినీతి చేశారని చెప్పారు. ఇప్పుడు అవే అంచనాలకు కేంద్రం ఆమోదం తెలియచేయడం ఆసక్తికరంగా మారింది.

పోలవరం అంచనాలపై గతంలో కావాలనే రాజకీయం చేశారా..?

నిజానికి 2010- 11 లెక్కల ప్రకారం వ్యయం రూ.16,010 కోట్లు. అప్పట్లో భూసేకరణ చట్టం రాలేదు. ఆ తర్వాత యూపీఏ హయాంలో భూసేకరణ చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చే ముందే.. భూసేకరణ చేసే అవకాశం ఉన్నప్పటికీ… రాష్ట్రంలో ఉన్న వైఎస్ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో… కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్… భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం.. పరిహారం.. మూడు రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టులో.. అత్యధిక వ్యయం.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకే ఉంటుంది. పోలవరంలోనూ.. కొన్ని లక్షల ఎకరాలు మునిగిపోతాయి. వారందరికీ పరిహారం… మూడు రెట్లు పెరిగిపోయింది. ఫలితంగా… అంచనాలు పెరిగిపోయాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు… మాత్రం దోపిడీ కోసమే అంచనాలు పెంచారని.. పోరాటం చేసారు.

ఇప్పుడు పోలవరం అంచనాలపై వైసీపీ విధానం ఏమిటి..?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. కాంట్రాక్టుల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాదాపుగా పనులన్నింటినీ నిలిపి వేయించారు. పోలవరంలోనూ… అవినీతి జరిగిందని.. అక్కడా సమీక్షకు ఆదేశించారు. పనులు తక్కువకు చేసే వారు ఉంటే.. వారికే పనులు ఇస్తామని చెబుతున్నారు. పోలవరాన్ని పరిశీలించిన సమయంలోనూ.. అవినీతిని తవ్వితీయాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో.. కేంద్రం… పోలవరం అంచనాల్లో… తప్పేమీ లేదని.. నేరుగా చెప్పినట్లుగా.. ఆమోదం తెలిపింది. కేంద్రమే అంచనాలను ఆమోదిస్తే.. అవినీతి ఎక్కడ ఉందని.. లోకేష్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close