ప్రజావేదిక కూల్చితే నష్టం కేవలం రూ. కోటి మాత్రమే నష్టమట..!

ప్రజావేదికను కూల్చివేయాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరకట్టపై అనేక నిర్మాణాలు ఉండగా.. దాదాపుగా రూ. ఎనిమిదిన్రన కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి.. నిర్మించిన కట్టడాన్ని ఒక్కదాన్నే కూల్చి వేయడం ఎందుకన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలా చేయడం వల్ల.. రూ. ఎనిమిదిన్నర కోట్ల ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము వృధా చేయడమే కదా..అన్న విమర్శలు అటు.. రాజకీయ పార్టీల నేతల నుంచి.. ఇటు.. సామాన్య ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. ప్రభుత్వం మరో సారి తన నిర్ణయాన్ని పరిశీలించాలనే వినతులు కూడా వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ప్రజావేదికను కూల్చాలనే పట్టుదలతోనే ఉందని.. మంత్రులు చేస్తున్న ప్రకటనలతో తేలిపోయింది.

ప్రజావేదిక కూలగొడితే రూ. కోటి మాత్రమే నష్టమా..?

ప్రజావేదికను..నేలమట్టం చేయాలన్న సీఎం జగన్ నిర్ణయానికి మంత్రుల నుంచి మద్దతు లభిస్తోంది. దీనిపై వస్తున్న విమర్శలను.. మంత్రులు తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి పేర్ని నాని ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు. ప్రజావేదికను.. కూలగొట్టడం వల్ల.. రూ. ఎనిమిదిన్నర కోట్ల నష్టం వస్తుందని ప్రచారం చేస్తున్నారని.. కానీ అంత నష్టం రాదని.. చెబుతున్నారు. కేవలం రూ. కోటి రూపాయలు మాత్రమే నష్టం వస్తుందని.. ప్రకటించారు. ఇంత మాత్రం దానికి ప్రతిపక్షాలు… అక్రమ కట్టడాన్ని కొనసాగించాలని.. డిమాండ్ చేయడం కరెక్ట్ కాదన్నది ఆయన ఉద్దేశం.

మంత్రి రూ. కోటి నష్టం లాజిక్ కరెక్టే..!?

ప్రజావేదిక కూలగొడితే.. వచ్చేది రూ. కోటి మాత్రమే నష్టమని.. పేర్ని నాని చెప్పిన లెక్క కరేక్టేనని.. అధికారవర్గాలు కూడా చెబుతున్నాయి. నిజంగానే.. ఆ వేదికను.. రూ. ఎనిమిదిన్నర కోట్లు పెట్టి కట్టారు. కానీ.. అది మొత్తం నిర్మాణానికి కాదు. అందులో ఉన్న ఫర్నీచర్, ఏపీలు, ఇతర వస్తువులు కలిపి ఆ మొత్తం వెచ్చించారు. కూలగొట్టే సమయంలో.. వాటన్నింటిని తీసుకెళ్లి.. ఇతర చోట్ల వినియోగించుకోవచ్చు. ఒక్క నిర్మాణం మాత్రమే కూలగొడతారు కాబట్టి.. ఆ నిర్మాణానికి అయిన మొత్తం రూ. కోటి కాబట్టి.. ఆ మొత్తం వరకే నష్టం వస్తుందని.. మంత్రి పేర్ని నాని విశ్లేషించారంటున్నారు. అదే నిజమని అధికారవర్గాలు కూడా చెబుతున్నాయి.

అదే నిజమైతే.. మరి అవినీతి ఆరోపణల సంగతేమిటి..?

అయితే.. పేర్నీ నాని వాదనతో ఏకీభవించినా… ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందని.. అదే పనిగా ఆరోపించిన వైసీపీ నేతలకు… మరో ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత అవినీతి జరిగితే… అంత మొత్తం నష్టం రావాలి కానీ.. కూలగొట్టినా.. మొత్తం ఎలా రికవరీ అవుతందనేది ప్రశ్న. అంచనాలు పెంచారని.. స్వయంగా సీఎం కూడా చెప్పారు కూడా… ఇప్పుడు.. పేర్ని నాని స్టేట్‌మెంట్‌ దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రజావేదిక కూల్చి వేత విషయంలో.. వైసీపీ రెండు వైపులా.. ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close